కేసీఆర్ గెలిచినా.. ఓడినా.. రాజ‌కీయ‌ పాఠ‌మే!

నిజ‌మే.. కేసీఆర్ శైలి వేరు. ఆయ‌న స్టాట‌జీ స‌ప‌రేటు. ఒక విధంగా చెప్పాలంటే.. సినీ  న‌టుల్లో ర‌జ‌నీకాంత్, క‌మ‌ల‌హాస‌న్ సూప‌ర్‌స్టార్‌లు. వీరిద్ద‌రినీ క‌లిపితే ఎలా ఉంటారంటే.. చిరంజీవిను చూపుతారు. అదే విధంగా.. తెలుగు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన వైఎస్‌, ఇప్ప‌టి సీఎం చంద్ర‌బాబునాయుడు.. ఇద్ద‌రిలోనూ ఉన్న రాజ‌కీయ వ్యూహాలు.. ఎత్తుగ‌డ‌లు ఎవ‌రిలో ఉన్నాయంటే.. వేళ్ల‌న్నీ కేసీఆర్ వైపు చూపుతాయి. ఇద్ద‌రు నేత‌ల‌ను ద‌గ్గ‌ర‌గా చూసినా.. వారితో క‌ల‌సి ప‌నిచేసిన‌.. క‌ల‌వ‌కుండా ప్ర‌త్య‌ర్థిగా ఎదురించిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇప్పుడు వారిద్ద‌రిలో కామ‌న్ పాయింట్ల‌ను.. త‌న రాజ‌కీయాలకు అక్క‌ర‌కు వ‌చ్చే  ఎత్తుల‌కు ప‌ద‌ను పెడుతున్నారు. జ‌మానా నుంచి తెలంగాణ ఉద్యమం సాగినా.. కేసీఆర్ మాత్ర‌మే ఆఖ‌ర్లో రాష్ట్ర సాధ‌న‌లో చివ‌రి నాయ‌కుడ‌య్యాడు. ప్ర‌జ‌ల దృష్టిలో కేసీఆర్ మాత్ర‌మే తెలంగాణ తెచ్చిండ‌నే అభిప్రాయాన్ని బ‌లంగా నాటాడు. అంత‌వ‌ర‌కూ ఓకే.. కానీ.. ఎన్నిక‌ల క్షేత్రంలో నెగ్గిన నాలుగున్న‌రేళ్ల‌కే మ‌ళ్లీ ఎన్నిక‌లంటూ వెళ్ల‌టం ఆశ్చ‌ర్యం. అదికూడా.. బ‌ల‌మైన హ‌స్తం ఉండ‌గా.. మ‌రోవైపు.. ఎన్నిక‌ల హామీల‌న్నీ కుప్ప‌పోసిన‌ట్లు ఉండ‌గా.. నిరుద్యోగులు, రైతులు నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తున్న స‌మ‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దుచేశారు. ఎన్నిక‌లు నిర్వ‌హించుకోండి.. మ‌ళ్లీ మేమే గెలిచి.. పీఠం ఎక్కుతామంటూ స‌వాల్ విసిరాడు.
ఏకంగా 105 మంది కేండిడెట్ల పేర్లు ప్ర‌క‌టించి. బాబోయ్ కేసీఆర్ త‌నను ఏమ‌న‌కుంటున్నాడ‌నే ఆలోచ‌న‌కు బీజం వేశాడు. కేసీఆర్ బ‌లాన్ని అంచ‌నావేసిన బీజేపీ.. ఇప్ప‌టికింతే అనుకుంటుంది. హ‌స్తం పార్టీ అయితే.. త‌న‌వ‌ల్ల‌కాద‌ని.. టీడీపీ వైపు దిక్కులు చూస్తుంది. మీరొస్తే.. మ‌నం మ‌నం.. క‌ల‌సి కేసీఆర్ ను ఓడిద్దామ‌నేంత చేరింది. ఇక  ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్‌.. డిసెంబ‌రులో మ‌న‌మే సీఎం అంటూ ప్ర‌క‌టించారు. ఆయ‌న అన్న అస‌దుద్దీన్ కారు మీదే.. కానీ.. ఇంజ‌న్ మాదంటూ మెలిక‌పెట్టారు. ఇన్ని ప్ర‌తికూల‌త‌లు.. అనుకూల‌త‌లు మ‌ధ్య 100 సీట్లు గెలుస్తామ‌ని చెప్ప‌టం వెనుక కేసీఆర్ ధీమా అంచ‌నాలు అంద‌న‌ది. అదే స‌మ‌యంలో తాను ఓడినా.. కింగే అనేది చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ట‌యింది. ఇప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల్లో కేసీఆర్ రాజ‌కీయ గెలుపోట‌ములు రాజ‌కీయ పార్టీల‌కు.. నేత‌ల‌కూ పాఠం కానున్నాయి. ఎందుకంటే.. దూకుడుగా నాయ‌కుడు ఉండాలి.. కానీ.. ఎంత వ‌ర‌కూ ఉండాలి.. ఎమోష‌న్‌గా  ఎలా మెల‌గాలి. అనేది కేసీఆర్ గెలుపు  చెబుతుంది. అదే స‌మ‌యంలో.. ఓడితే.. ఎలా ఉండ‌కూడ‌ద‌నేది కూడా కేసీఆర్ ఓట‌మి నేర్పుతుంది. ఎలా చూసినా.. కేసీఆర్‌.. ఈజ్ కేసీఆర్‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.