టీఆర్‌ఎస్‌లో చేరికల జోరు… విపక్షాలు బేజారు?

టీఆర్‌ఎస్‌లోకి వలసల జోరు అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే కార్యక్రమాలను  ఆ పార్టీ నేతలు నిత్యం కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.  చేరికల పరంపరతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనికితోడు మరుసటి రోజు నుంచే అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు. మండలాలు, గ్రామాలు, పల్లెలు కలియ తిరుగుతూ పార్టీశ్రేణుల్లో జోష్‌ నింపారు. దీంతో ఇతర పార్టీలకు చెందిన ప్రథమ, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరేందకు క్యూ కట్టారు. ప్రతిపక్షాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఎక్కడికక్కడే గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ దళం రెట్టించిన ఉత్సాహంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. పల్లెలు, గ్రామాలు, మండలాలే కదిలివచ్చి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే మద్దతు ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలు ఖాళీ అవడంతో తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని టీఆర్‌ఎస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారట.
కారు స్పీడ్‌ను తట్టుకోలేక ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం. ఆయా గ్రామాల నుంచి చేరికలు కొనసాగేలా రోజుకో చోట కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని అన్ని  వర్గాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తండాలు, గూడేలు, చిన్నచిన్న కాలనీల్లో ర్యాలీలు నిర్వహిస్తూ అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని నేతలు మద్దతు కోరుతున్నారట. మరోవైపు ఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు గ్రామాల్లో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు ప్రచారం లో పాల్గొనేలా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. జనంలో  కలిసిపోయి నేతలుప్రచారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.  ప్రతిపక్షాలు జట్టుకట్టి మహాకూటమి ఏర్పడిన నేపధ్యంలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరికి టికెట్‌ ఇస్తారనే విషయంలో స్పష్టత కరువైంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్‌ పెంచడంతో  ప్రతిపక్షాల నుంచి వలసలు జోరు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా పార్టీశ్రేణులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.