పోలంరెడ్డి… అనే నువ్వు… ఇలా చేస్తున్నావేంట‌య్యా!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోవూరు నియోజకవర్గ తెలుగుదేశంలో విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి  టీడీపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ వారంతా రాష్ట్ర నాయకత్వానికి  ఫిర్యాదు చేశార‌ని తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే పోలంరెడ్డి టీడీపీలో చేరి, కోవూరు నుంచి విజ‌యం సాధించారు. అయితే పోలంరెడ్డి ఎన్నికల తరువాత  టీడీపీ కార్యకర్తలను విస్మరిస్తూ కొత్తగా  చేరిన ఆయ‌న‌ అనుచరులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ స్థానిక‌ తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు నియోజకవర్గ పరిధిలోని నామినేటెడ్ పదవుల్లోనూ పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా కొత్తవారికి అవకాశం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండ‌గా గత ఏడాది ఎంపిక చేసిన బూత్ కమిటీ అధ్యక్షులను తొలగించి కాత్త‌వారిని నియ‌మించారంటూ  కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే పోలంరెడ్డి ప్రమేయంతో ఈ మార్పు జరిగిందని, దీంతో పార్టీని నమ్ముకున్న తమలాంటి వారికిఎంతో నష్టమని తెలుగుతమ్ముళ్లు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో కోవూరు మండలంలో జరుగుతున్న గ్రామదర్శిని కార్యక్రమాన్ని బహిష్కరించారు. అదేవిధంగా కోవూరు మండల టీడీపీ నేతలు, కార్యకర్తలు సామూహికంగా జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకొని పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేశారు. నాలుగేళ్లపాటు ఎన్ని అవమానాలు జరిగినా తట్టుకున్నామని ఆయ‌న ముందు త‌మ ఆవేద‌న వెళ్ల‌గ‌క్కార‌ని తెలుస్తోంది. ఏకంగా 16 మంది బూత్‌కమిటీల అధ్యక్షులను తొలగించడం స‌రైని కాద‌ని వారంటున్నారు. వెంటనే ఈవిషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తెలియ‌జేవాల‌ని వారు బీద రవిచంద్రను కోరార‌ని తెలుస్తోంది. ఈ స‌మ‌స్య  పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చార‌ట‌! పార్టీ  ఏదిఏమైన‌ప్ప‌టికీ ఎమ్మెల్యే పోలంరెడ్డి త‌న‌ తీరు మార్చుకోక‌పోతే కోవూరులో టీడీపీకి కష్టాలు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.