ఆ రోజు తీసిప‌డేసి… ఈరోజు బ‌తిమ‌లాడి

నాలుగేళ్ల క్రితం సంగ‌తి. మోడీ… దేశ ర‌క్ష‌కుడు. నోస్ట్ర‌డామ‌స్ చెప్పిన వ్య‌క్తి ఇత‌నే. చ‌రిత్ర గ‌తిని మార్చేస్తాడు. న‌ల్ల‌ధ‌న‌మే లేకుండా చేస్తాడు. అవినీతి భ‌ర‌తం ప‌డ‌తాడు. హిందూ మ‌తాన్ని కాపాడ‌తాడు. ఉపాధి సృష్టి చేస్తాడు. ఇక రామ‌రాజ్యం వ‌చ్చిన‌ట్లే. ఇది మోడీ భ‌క్తులు చేసిన ప్ర‌చారం.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం ఉంచిన న‌మ్మ‌కం.
నాలుగేళ్లు గిర్రున తిరిగాయి. విపరీతంగా హైప్ వ‌చ్చిన సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ట్టు. నాలుగంటే నాలుగేళ్ల‌లో మోడీ ప్ర‌భ క‌నుమ‌రుగ‌యింది. సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్త వ‌ర‌కు మోడీని తిట్ట‌ని వాడు లేడు. దీనికి ఒక నెటిజ‌న్ స‌రైన కామెంట్ చేశాడు. మోడీ ఈజ్ ఎ ఓవ‌ర్ రేటెడ్ మ్యాన్ నాట్ ఈవెన్ ఎన్‌ ఓవ‌ర్ రేటెడ్ పీఎం… అని. బ‌హుశా ఇది నిజ‌మే అనిపిస్తుంది.
నోట్ల ర‌ద్దుతో అత‌ని తెలివితేట‌లు బ‌య‌ట‌ప‌డితే, జీఎస్టీతో అత‌ని అస‌మ‌ర్థ‌త బ‌య‌ట‌ప‌డింది. అద్వానీకి నిండు స‌భ‌లో జ‌రిగిన అవ‌మానంతో అత‌ని కుతంత్రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. కానీ క‌ట్ చేస్తే కేవ‌లం కొన్ని నెల‌ల్లోనే సీన్ రివ‌ర్స‌య్యింది. పాల‌న పోయింద‌నే విష‌యం అర్థ‌మైంది. పాల‌న పోయినా పెద్ద వాళ్ల అండ ఉంటే గ‌ట్టెక్కేవాడు. త‌న‌కు అడ్డువ‌స్తున్నార‌ని వారిని త‌ప్పించాడు. అద్వానీని గుర్తిస్తే రాష్ట్రప‌తి ప‌ద‌వి ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న్ను ఇగ్నోర్ చేశాడు. వెంక‌య్య ఉంటే రాజ‌కీయ మొహ‌మాటం అని ఆయ‌న్నూ త‌ప్పించాడు. అంద‌రూ వెళ్లాక అర్థ‌మైంది వాళ్ల బ‌ల‌మే త‌న బ‌ల‌మ‌ని. త‌న‌లో ఏ బ‌లం లేద‌ని. అంతే… మ‌ళ్లీ ఇపుడు వ‌రుస‌గా డ్రామా మొద‌లుపెట్టాడు మోడీ.
అద్వానీ చేతులెత్తి ప‌దేప‌దే దండం పెట్టిన ప‌ట్టించుకోని మోడీ ఇంటికెళ్లి మోక‌రిల్లాడు. నా ప‌ని అయిపోయింది కాపాడు సామీ అని రిక్వెస్ట్ చేశాడు. తాజాగా వెంక‌య్యానాయుడిని క‌లిసి ముచ్చ‌ట్లు పెట్టి మంచి చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. వెంక‌య్య క‌నుక రాజ‌కీయాల్లో ఉండి ఉంటే… మోడీ ఈరోజు భ‌య‌ప‌డుతున్న మహాకూట‌మే పుట్టేది కాదు. అయినా కేవ‌లం త‌న అహంభావంతో పీక‌ల‌దాకా తెచ్చుకుని అంతా చేయిదాటిపోయాక ఇపుడు ఏడిస్తే ఏం లాభం. అందుకే ఒక నెటిజ‌న్ అద్వానికి మొక్కుతున్న మోడీ ఫొటో చూసి ఇలా కామెంట్ పెట్టాడు.
*నిన్ను అద్వానీయే కాదు, ఆ దేవుడు కూడా కాపాడ‌లేడు మోడీ* అని. మ‌నం ప‌గ‌లు ప్ర‌తీకారాలు మ‌రిచిపోయినా కాలం మరిచిపోదు.

see how modi insults advani

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.