ర‌హ‌స్యం చెప్పేసిన ప‌వ‌న్ – వైసీపీ ప‌రువు గోవిందా!

చాలా కాలం నుంచి టీఆర్ఎస్ – వైసీపీల మ‌ధ్య స్నేహ‌బంధం ఉంది. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డం కూడా అందులో భాగ‌మే. ఏపీ ప్ర‌యోజ‌నాలు వ‌దిలేసి త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం జ‌గ‌న్ కేసీఆర్ చెప్పిన‌ట్టు ఆడుతున్నాడ‌ని టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేల్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయితే, ఆయ‌న నేరుగా ఈ విష‌యం చెప్ప‌లేదు. కానీ అత‌ను చేసిన కొన్ని రాజ‌కీయ వ్యాఖ్య‌ల వ‌ల్ల ఈ ర‌హ‌స్యం వీడిపోయింది. టీఆర్ఎస్‌-వైసీపీతో క‌లిసి చేస్తున్న కుట్ర‌ల‌కు ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇపుడు ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఏపీలో రెండు పార్టీలు (తెలుగుదేశం, వైసీపీ) త‌మతో పొత్తుకు వెంప‌ర్లాడుతున్నాయ‌ని ప‌వ‌న్ ఈరోజు వ్యాఖ్యానించారు. అది కూడా కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఈ మాట అన‌డం విశేషం. చంద్ర‌బాబు బ‌హిరంగంగానే త‌మ పొత్తుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ని… జ‌గ‌న్ మాత్రం పైకి మేము ఎవ‌రితో క‌ల‌వం అని చెబుతూనే టీఆర్ఎస్ ద్వారా వైసీపీతో పొత్తుకు రాయ‌బారం న‌డుపుతున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప‌వ‌న్. ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు వైసీపీతోపొత్తు పెట్టుకోమ‌ని త‌మ‌ని సంప్ర‌దించార‌ని… ఆ రాయబారం జ‌గ‌న్ నుంచే వ‌చ్చిన‌ట్టు వారు చెప్పార‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. మాకు బ‌లం లేదంటారు, మ‌ళ్లీ ఈ ప్ర‌య‌త్నాలు చేస్తారు… ఇలా ఎందుకు ? అని ప‌వ‌న్ ప్ర‌శ్నించార‌ట‌.

టీఆర్ఎస్ రాయభారం గురించి ప‌వ‌న్‌చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో పెద్ద సంచ‌ల‌నం సృష్టించేలా ఉన్నాయి. ఒక‌వైపు మోడీకి టీఆర్ఎస్ శ‌క్తివంచ‌న లేకుండా స‌హ‌కరిస్తోంది. మ‌రోవైపు మోడీ ఏపీకి ఉత్త చేతులు చూపుతున్నారు. అయినా ప్ర‌తిప‌క్ష నేత‌… మోడీని ఏమీ అన‌క‌పోయినా ప‌ర్లేదు గాని ఏపీకి అన్యాయం చేసిన మోడీతో చేతులు క‌ల‌ప‌డానికి కూడా రెడీ అయ్యారు. టీఆర్ఎస్ రిట‌ర్న్ గిఫ్ట్ అంటూ ఒక‌వైపు చెబితే… ఆ వెంట‌నే కేసీఆర్ మిత్రుడు, మోడీ కుట్ర టీం స‌భ్యుడు అస‌ద్ కూడా ఏపీకి వ‌స్తాను అన్నాడు. ఈ వ‌ర‌స అంతా చూస్తుంటే… ఏపీలో ఒక పెద్ద రాజ‌కీయ వ్యూహానికి పునాదులు ప‌డిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈరోజు ప‌వ‌న్ చేసిన కామెంట్ల‌తో ఎవ‌రి పాత్ర ఎంత‌న్న‌ది స్ప‌ష్టంగా తేలిపోయింది. చంద్ర‌బాబును దింప‌డానికి మోడీ-కేసీఆర్‌-జ‌గ‌న్‌-అస‌దుద్దీన్ కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు తేలిపోయింది. ఈ క్ర‌మంలో అందులోకి ప‌వ‌న్ లాగ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ చేరితో కొంత క్రెడిబులిటీ వ‌స్తుంద‌న్న‌ది మోడీ ఆశ అయితే, ఓట్ల చీలి ఓడిపోకుండా ఉంటామ‌ని జ‌గ‌న్ జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.