తెలుగు నేల‌పై ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఇంపాక్ట్‌?

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు.. అలాగ‌నీ ఎప్పుడూ క‌లిసే ఉండే మిత్రులూ ఉండ‌రు. 2009 , 2014 ఎన్నిక‌లు ప్ర‌జ‌ల వినూత్న తీర్పు రాజ‌కీయ పార్టీల‌కు.. నేత‌ల‌కు గుణ‌పాఠాలు నేర్పాయ‌నే చెప్పాలి. ఎప్పుడూ తాము అనుకున్న‌ది జ‌ర‌గ‌ద‌ని.. తాము వేసిన లెక్క‌లే స‌రైన‌వి కాద‌ని గ్ర‌హించారు. 2019 ఎన్నిక‌లు అటు ఏపీ, ఇటు తెలంగాణ‌లో చంద్రుల‌కు ఒన్‌సైడ్‌గా అనిపించినా.. క‌నిపించ‌ని స‌మీక‌ర‌ణ‌లు అవ‌కాశాల‌ను తారుమారు చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఒక్క ఓటు.. ఒక్క సీటు అధికంగా వ‌చ్చినా అధికారం చేజిక్కే అవ‌కాశం ఉంది. లోక‌ల్ పాలిటిక్స్ కూడా నియోజ‌క‌వ‌ర్గ ఓటింగ్‌ను  ప్ర‌భావితం చేయ‌గ‌లవ‌నేది వాస్త‌వం. ఇప్పడెందుకీ చ‌ర్చ అంటే.. జ‌న‌సేన నాలుగేళ్ల క్రితం పురుడుపోసుకున్న పార్టీ. అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒక హీరో అయితే.. స‌మ‌స్య‌లేదు. కానీ.. ప‌వ‌న్ అవునన్నా.. కాద‌న్నా.. కాపు సామాజిక‌వ‌ర్గం అత‌డిని త‌మ నేత‌గా భావిస్తుంది. ప్ర‌స్తుతం రాజ‌కీయ‌ యాత్ర‌కు శ్రీకారం చుట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ఎంత ప్ర‌భావం చూపుతార‌నే చ‌ర్చ మొద‌లైంది. 2014తో పోల్సితే ప‌వ‌న్ రాజ‌కీయ ప‌రిణితి సాధించారు. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ప‌నిచేయాలంటూ కార్య‌కర్త‌ల‌కు ఇచ్చిన సూచ‌న ఆయ‌న టార్గెట్ 2019 కాద‌నేది అర్ధ‌మ‌వుతోంది. అటువంటి స‌మ‌యంలో ప‌వ‌న్‌.. ఇత‌ర రాజ‌కీయ పార్టీల సంప్ర‌దాయ ఓట్ల‌ను చీల్చే ప్ర‌మాద‌మూ లేక‌పోలేదు. అదే జ‌రిగితే ఎవ‌రికి ఎంత ప్ర‌యోజ‌నం అనేది ప‌క్క‌న‌బెడితే.. చీలిక ఓట్ల‌తో ఏ రాజ‌కీయ పార్టీ లాభ‌ప‌డుతుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. తెలంగాణ‌లోఆశించినంత సీట్లు.. ఓట్లు రాల‌క‌పోయినా.. ఓట్లు కొంత‌మేర చీలే అవ‌కాశం ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య‌గోదావ‌రి, కృష్ణ‌, గుంటూరు, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో ప‌వ‌న్ పార్టీ ప్ర‌భావం ప‌క్కాగా ఉంటుంద‌నేది ఆ పార్టీ  నేత‌ల విశ్లేష‌ణ‌. ప‌దుల సంఖ్య‌లో సీట్లు కొల్ల‌గొట్ట‌క‌పోయినా.. మిగిలిన పార్టీల ఓట్ల‌ను చీల్చి పారేస్తుంద‌నే నిర్విదాంశం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.