కొడతాం అంటున్న పవన్…

మాటల దాడి పెంచారు పవన్ కల్యాణ్. తనను అణిచివేస్తే ఎంతగా రెచ్చిపోతానో చూడండని సవాల్ విసిరారు. ముఖ్యంగా టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కిరాయి మూకలు, గూండాలతో దాడికి ప్రయత్నిస్తే.. బట్టలూడదీసి తరిమితరిమి కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా టీడీపీ అదే స్థాయిలో కౌంటరిస్తోంది. మీకు చేతనైంది చేసుకోవాలని సవాల్ విసురుతోంది. ఫలితంగా మాటల మంటలు మండుతున్నాయి. 
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిరసన కవాతు జరగకుండా లారీలు అడ్డుపెట్టారని ఆరోపించారు పవన్. తన పర్యటనను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అంతే కాదు.. పలాసలో తాను బసచేసిన చోట కరెంట్ తీసి కిరాయి మూకలు ద్వారా దాడిచేయాలని చూశారన్నారు. నేను అన్నింటికీ తెగించిన వ్యక్తిని. ప్రజాసమస్యలపై పోరాటానికి వచ్చినోడిని. ఇలాంటి పిచ్చిపిచ్చి పనులకు భయపడేవాడిని కాదని కాస్త ఆవేశంగానే మాట్లాడారు పవన్. రాజకీయాల్లో వాడి వేడిమాటలు ఉండాలి. కాదనలేం. కానీ నేను తెగించాను. ఊరుకునేది లేదని చెప్పడంతో టీడీపీ శ్రేణులు అంతే స్థాయిలో స్పందించడంతో పవన్ యాత్ర సజావుగా సాగుతుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ టార్గెట్ గా పవన్ మాటలు ఉంటున్నాయి. అదే సమయంలో పవన్ ను టీడీపీ మాటలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.  
అందుకే తన ఆవేశాన్ని ఆపుకోలేక గట్టిగానే మాట్లాడుతున్నారు పవన్. శ్రీకాకుళం సైనికులు పుట్టిన నేల.  స్వేచ్ఛామాత పుట్టిన నేల… భరతమాతకి గుడి ఉన్న ఏకైక నేల. దేశంలో ఏ మూలకెళ్లినా ఓ శ్రీకాకుళం సైనికుడు కనపడతాడు. జైహింద్ అంటాడు. వారి కోసం నేను మిలటరీ చొక్కా వేసుకున్నాను. రౌడీలను, గూండాలను పంపిస్తే… మేం సైనికులమని గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు.  కిరాయి గుండాలు వస్తే కొడతాం. వేషాయ వేయవద్దని హెచ్చరించడం ఉద్రిక్తతలను పెంచుతోంది. మరోవైపు పవన్ కల్యాణ్ మాటలకు టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేసే అవకాశముందని ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఫలితంగా ఏం జరగబోతుందనే ఉత్కంఠ పెరుగుతోంది. 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.