ప‌వ‌న్ తేల్చుకోలేక‌పోతున్నారా! 

ఏపీ రాజ‌కీయం కాపుల చుట్టూ తిరుగుతోంది. దాదాపు 73 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌పై ప్ర‌భావం చూపే కాపు ఓట‌ర్ల‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ వేసిన ఎత్తుగ‌డ‌లో విజ‌యాన్ని తెచ్చిపెట్టింది.. రైతురుణ‌మాఫీ కాగా.. రెండోది కాపుల రిజ‌ర్వేష‌న్‌. ఇప్పుడు మ‌ళ్లీ ఈ రెండే 2019లో పార్టీల‌ను గ‌ట్టెక్కించే అస్త్రశ‌స్త్రం. అందుకే.. టీడీపీ ముందుగానే మేల్కొంది. వైసీపీ కూడా.. సాధ్యాసాధ్య‌ల‌ను గ‌మ‌నించి కాస్త సందిగ్థంలో ఉంది. లోప‌ల ఉన్న‌మాట‌ల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌కుండా ఉంటే.. పార్టీకు కాస్త‌యినా మేలు చేసేదేమో. కానీ.. కాపుల రిజ‌ర్వేష‌న్స్‌పై చేతులెత్తేసిన‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించి కాపు రిజ‌ర్వేష‌న్స్‌కు ఆజ్యం పోసిన‌ట్ట‌యింది. దీనిపై మేం పోరాడ‌తామంటూ.. కొత్త ప‌ల్ల‌వి అందుకుంది టీడీపీ. లాభ‌న‌ష్టాలు.. కాపులు టీడీపీ వైపు మ‌రోసారి నిల‌బ‌డ‌తారా అనేది వేరే సంగ‌తి. ప్ర‌స్తుతానికి మేం రిజ‌ర్వేష‌న్స్‌కు క‌ట్టుబ‌డి ఉన్నామంటూ జ‌గ‌న్ కామెంట్స్ కు ప్ర‌తిసమాధానం ఇచ్చి టీడీపీ గండం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు స్పందించాల్సింది.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. గ‌తంలో టీడీపీ ఇచ్చిన‌ హామీగానే కాపు రిజ‌ర్వేష‌న్‌ను ప్ర‌స్తావించారు. ప‌వ‌న్ తాను కాపు వ‌ర్గం నుంచి వ‌చ్చినా మ‌నం భార‌తీయుల‌మ‌నే అభిప్రాయాన్నే వెలిబుచ్చేవారు. కుల ముద్ర వేయ‌టం ద్వారా విప‌క్షాలు త‌న‌ను కేవ‌లం కొంద‌రివాడిగా ఉంచుతాయ‌నే అభిప్రాయ‌మూ కావ‌చ్చు. స్వ‌త‌హాగా ప‌వ‌న్ వ్య‌క్తిత్వ‌మూ కావ‌చ్చు.
కానీ రాజ‌కీయాల్లో ఇప్పుడున్న‌ది కుల‌పోరే. మ‌నోడు అనుకుంటే త‌ప్ప ఓట‌ర్లు పోలింగ్‌బూత్ వ‌ర‌కూ వ‌చ్చే ప‌రిస్థితి లేద‌నే చెప్పాలి. గ‌త నాలుగేళ్లుగా కుల బ‌లం మీద‌నే నేత‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లోనూ ఇదే త‌ర‌హా పంచాయ‌తీలు ఇప్పుడే మొద‌ల‌య్యాయి. ఇక ఏపీలో కుల‌మే రాజ‌కీయ‌నేత‌ల‌కు.. ప‌వ‌ర్ ఇచ్చినా.. ఓట‌మి పంచినా అన్న‌ట్లుగా ఉంది. ఇటువంటి వేదిక‌గా మారిన ఏపీలో కాపులు, బీసీలు రెండు వ‌ర్గాలుగా మారే అవ‌కాశాలూ లేక‌పోలేదు. ఎందుకంటే.. కాపులకు రిజ‌ర్వేష‌న్స్ ఇవ్వ‌టం ద్వారా త‌మ వాటా త‌గ్గుతుంద‌నే ఆందోళ‌న‌. వాస్త‌వానికి ఇది బీసీల‌కూ ఇబ్బందిక‌ర‌మే. అయితే.. బీసీల‌కు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ 9లో 5 శాతం కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ చేర్చ‌టం ద్వారా అంద‌రికీ ఆమోదం. కానీ.. కేంద్రం ఇప్పుడు ఆ ప‌నిచేయ‌దు. 2019లో తాము అధికారంలోకి వ‌స్తే.. చేస్తామంటూ క‌మ‌లం ఎన్నిక‌ల వేళ దీన్నే అస్త్రంగా మార్చుకునే అవ‌కాశం ఉంది. మ‌రి కాపుసామాజిక‌వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ మాత్రం ఇప్ప‌టికీ దీనిపై ఎలా స్పందించాల‌నే విష‌య‌మై క్లారిటీ ఇవ్వ‌ట్లేదు. దీని వెనుక మరేదైనాకార‌ణం ఉందా అనే అనుమానాలు కూడా వున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.