ప‌వ‌న్ కింగా.. కింగ్‌మేక‌రా!

ఇదెప్ప‌టి నుంచో వినిపిస్తున్న‌మాటే. ఇందులో కొత్తేముంది. అనుకుంటున్నారా! నిజ‌మే… ఎప్పుడు విన్నా.. కొత్త‌దే.. ఎందుకంటే. అది నిజ‌మా! కేవ‌లం అపోహా అనేది తేలేంత వ‌ర‌కూ చ‌ర్చ‌నీయాంశ‌మే. 1996లో అక్క‌డ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా సినీ ఎంట్రీ జ‌రిగింది. కొద్దికాలంలోనే యూత్‌లో మాంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అది ఇన్నేళ్ల వ్య‌వ‌ధిలో మెగాస్టార్ కూడా ప‌వ‌ర్‌స్టార్ ఇమేజ్‌ను చూసి.. అభిమానుల కేరింత‌లు చూసి.. అల్ల‌రి భ‌రించ‌లేక చికాకు ప్ర‌ద‌ర్శించేంత వ‌ర‌కూ చేరింది. వ్య‌క్తిగ‌తంగా మూడు పెళ్లిళ్ల‌నే ఒకే ఒక్క విష‌యం లేక‌పోతే.. విప‌క్షాల‌కు విమ‌ర్శించేందుకు ఒక్క కార‌ణం కూడా దొరికేది కాదనేంత‌గా అభిమానుల‌తో బావోద్వేగంతో ముడిప‌డిన హీరోగా మారాడు. ఇదంతా  ఇప్ప‌టికీ  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌. అటువంటి నేత 2014లో టీడీపీ ప‌క్క‌న నిల‌బ‌డి ప్ర‌చారానికి వెళితే.. యువ‌త బాగానే స్పందించారు. చంద్ర‌బాబునాయుడు కావాల‌ని భావిస్తున్న స‌మ‌యంలో త‌న మ‌న‌సులో మాట కూడా అదేనంటూ జ‌గ‌న్ వంటి అవినీతిప‌రుడు సీఎం కాకూడ‌ద‌నే విష‌యాన్ని ప‌వ‌న్ కూడా యువ‌తలో బాగానే ఎక్కించారు. ఫ‌లితంగా జ‌గ‌న్ అధికార పీఠానికి దూర‌మ‌య్యాడు. ఇప్పుడు ప‌వ‌న్‌విమ‌ర్శ‌ల‌తో టీడీపీ నేత‌లు గెలుపు వెనుక మా క‌ష్ట‌మేనంటున్నారు. వాస్త‌వానికి దానిలో ఎంతో కొంత ప‌వ‌న్ ప్ర‌మేయం ఉంద‌నేది జ‌గ‌మెరిగిన వాస్త‌వం.
అందుకే.. 2019లో జ‌న‌సేనాని, వామ‌ప‌క్షాల‌తో క‌ల‌సి పోటీకి దిగ‌బోతున్నారు. అయితే సో వాట్‌.. అనుకోవ‌చ్చు. కానీ.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, ప‌వ‌న్ ఇమేజ్‌.. త‌ట‌స్థ ఓట‌ర్ల కొంత‌మేర ప‌వ‌న్ పార్టీ వైపు మొగ్గుచూపుతార‌నేది వాస్త‌వం. అయితే.. అది ఎన్నిసీట్లు తెప్పిస్తుంది. ఎన్నిచోట్ల గెలిపిస్తుంద‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. కానీ.. త‌ప్ప‌నిస‌రిగా 30-40 అసెంబ్లీ సీట్ల‌యినా గెలుచుకుంటార‌నేది జ‌న‌సేన అంచ‌నా. మ‌రీ అదృష్టం వ‌రించి.. జ‌నం ఒక్క‌సారి అవ‌కాశం ఇద్దామ‌నుకుంటే ఏకంగా సీఎం పీఠ‌మే ద‌క్క‌వ‌చ్చ‌నేది విశ్లేష‌కుల వాద‌న కూడా. అయితే.. దీనివెనుక‌.. మ‌రో భిన్నాభిప్రాయంకూడా ఉంది. ఎందుకంటే.. ఏక పార్టీ అదీ కొత్త‌గా వ‌చ్చి బ‌రిలో నిల‌బ‌డి.. ప్ర‌త్య‌ర్థుల‌తో త‌ల‌బ‌డి ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేంత ప‌రిస్థితుల్లేవు. పైగా ఇది 1982 కాదు.. 2019 టీడీపీ బ‌లంగా ఉంది.. వైసీపీ కూడా ధీమాగా ఉంది.. కాంగ్రెస్ బ‌ల‌ప‌డి.. గ‌ట్టి పోటీనిచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇటువంటి విపత్క‌ర స‌మ‌యంలో ప‌వ‌ర్ సంగ‌తి ఎలా వున్నా.. క‌ర్ణాట‌కలో ఏర్ప‌డిన‌ట్లుగా.. కింగ్‌మేక‌ర్‌గా మాత్ర‌మే ప‌వ‌న్ చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుంది. మ‌రి.. ప‌వ‌న్ మ‌న‌సులో మాట నెర‌వేరుతుందా! క‌న్న‌డీయుల తీర్పు.. ఏపీలో పున‌రావృత‌మ‌వుతుందా! ఏమో.. రాజ‌కీయాలు క‌దా! ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు.. జ‌ర‌గ‌క‌పోనూ వ‌చ్చు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.