పవన్ వాళ్లకే టికెట్లు ఇస్తాడట

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని పార్టీలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ప్రత్యేకంగా నిలుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి, పోటీకి దూరంగా ఉన్న జనసేనాని.. ఉన్నట్లుండి ఆ పార్టీకి ఎదురు తిరిగాడు. అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఇలా ఆయన ఇష్టం వచ్చిన వాళ్లపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. అంతేకాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే కొన్ని జిల్లాల్లో ప్రజాపోరాటయాత్ర పేరిట పర్యటనలు కూడా చేశాడు. అలాగే కవాతులు, కగడాల ర్యాలీలు, రైలు యాత్రలు నిర్వహించాడు. ప్రస్తుతం వాటన్నింటిని పక్కన పెట్టేసి పూర్తిగా పార్టీపైనే దృష్టి సారించాడు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీని కోసం జనవరి ఒకటి నుంచే విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఉంటానని చెప్పి, అక్కడే ఉంటున్నాడు. ఎన్నికలు సమయం దగ్గరపడుతుండడంతో మిగిలిన కార్యక్రమాలపై దృష్టి సారించిన పవన్.. అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీలు వేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

‘‘ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణా నికి సమయం ఆసన్నమైంది. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేయాలని నిర్ణయించాం. దీనికోసమే జిల్లా సమీక్షలు. ప్రస్తుత సంప్రదాయ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పుకు జనసేన ఆలంబనగా నిలవాలి’’ అంట ఇటీవల జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చిన పవన్.. అభ్యర్థుల ఎంపిక పైనే వారికి కొన్ని సూచనలిచ్చాడు. ముందగా కమిటీలను వేస్తామన్న పవన్.. ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 25 మందికి తగ్గకుండా వారి వివరాలతో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సమర్పించాలని, వీటన్నింటినీ వడబోసి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వాళ్లకు చెప్పాడు. అయితే పవన్ ఆలోచనలో మాత్రం డబ్బును ప్రాతిపదకగా చూడకుండా.. మంచి వ్యక్తిత్వం ఉండి, సొంత ఇమేజ్‌తో నియోజకవర్గంలో కనీసం పది వేల ఓట్లు తెచ్చుకునే సామర్ధ్యం ఉన్న వాళ్లకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నాడట. ఇలా చేస్తే ఆ అభ్యర్థికి పవన్, జనసేన ఇమేజ్‌ తోడై ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనలో జనసేనాని ఉన్నాడని తెలుస్తోంది. ఇదే జరిగితే జనసేనలో ఉన్న ఫ్యాన్స్ పరిస్థితి ఏంటనే టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.