పవన్ కూడా కాపులకు షాక్ ఇవ్వబోతున్నాడా.?

గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన జనసేన అధినేత పవన్.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో భాగంగా తన ప్రత్యేకతను చాటుకునేందుకు పరితపిస్తున్నాడు. ఒకవైపు ఇలాంటి పనులు చక్కబెడుతూనే, మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్‌ కొత్తగా ఆలోచిస్తూ.. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సాధారణ అంశాలపై తానే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్న జనసేనాని.. సున్నితమైన అంశాలపై మాత్రం మేధావులతో చర్చించిన తర్వాతే ఒక అంచనాకు వస్తున్నాడు. జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించినప్పటి నుంచి కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉన్నదని ప్రచారం జరుగుతోంది. అందుకే అక్కడ నిలబెట్టే అభ్యర్ధుల గురించి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జనసేనకు సంబంధించిన ఓ వార్త బయటికి వచ్చింది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు తమ ఆశలు అడియాశలు అయ్యాయని తెగ ఫీలైపోతున్నారట.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే అభ్యర్ధుల ఎంపిక ముఖ్యమైనది కాబట్టి పవన్ ప్రస్తుతం దానిపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒకవైపు జనాలకు దగ్గరయ్యేలా ప్రజాపోరాటయాత్ర చేస్తున్న పవన్.. మరోవైపు ఖాళీ సమయాల్లో అభ్యర్ధుల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాడట. గోదావరి జిల్లాల్లో అందరూ అనుకుంటున్నట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎక్కువ టికెట్లు ఇవ్వకూడదని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన కాపుల పార్టీ అనే ముద్ర జనసేనపై కూడా పడే ప్రమాదం ఉన్నదని ఆయన ఆలోచిస్తున్నాడని సమాచారం. ఈ కారణంగానే పవన్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు, ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలతో జనసేనలోని కీలక నేతలు మంతనాలు కూడా జరిపారట. ఎన్నికల సమయానికి తమ పార్టీ టికెట్లు ఇవ్వని పక్షంలో జనసేనలోకి వస్తామని వారు తేల్చి చెప్పేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ తీసుకున్న ఈ నిర్ణయంతో జనసేనలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.