పవన్ సంచలన నిర్ణయం.. వాళ్లకు 58 సీట్లట

2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ముఖాముఖి తలపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉన్నా ఎక్కడా కనీస డిపాజిట్లు దక్కలేదు. అప్పుడు టీడీపీ-బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన కూడా ఇప్పుడు ఎన్నికల బరిలో నిలవబోతోంది. ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. తెలుగుదేశం, వైసీపీతోపాటు.. ఈ దఫా జనసేన కూడా ఎన్నికల బరిలోకి దిగుతోంది. పవన్‌ సినీ ఇమేజ్‌, సామాజికవర్గ ప్రభావంతో జనసేన కొన్నిచోట్ల ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో పవన్‌ పార్టీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో పవన్ జిల్లాల్లో పర్యటించడం.. అక్కడి ముఖ్య నేతలను తన పార్టీలోకి ఆహ్వానించడం వంటివి చేస్తున్నాడు. ఒకవైపు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతూ, గ్రామ, మండల స్థాయి నేతలను కలుస్తూ, మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జనసేన చీల్చబోయే ఓట్ల ప్రభావం ఏ పార్టీకి లాభిస్తుంది? ఏ పార్టీకి మైనస్‌ అవుతుంది? అనే అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల నాటికి జనసేన మరింత పుంజుకుంటే ఎన్ని సీట్లు దక్కించుకోగలదు? అనేదానిపైనా జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీ స్పీడు పెంచేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపించి, ప్రభుత్వ ఏర్పాటు కీలక పాత్ర పోషించాలనుకుంటోంది. అందుకోసం ఎప్పటి నుంచో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా తమ పార్టీ రూపొందించుకున్న సిద్ధాంతాలను ఫాలో అవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో నిలబెట్టే అభ్యర్ధుల్లో 33 శాతం అంటే దాదాపు 58 సీట్లు మహిళలకు కేటాయించాలనుకుంటుందట జనసేన అధిష్టానం. ఇలా చేయడం ద్వారా ఇతర పార్టీలపై కూడా ఒత్తిడి తీసుకురావచ్చనేది ఆ పార్టీ వ్యూహంమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన సంకేతాలు వెళ్లిపోయాయని సమాచారం. అందుకోసం రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో జనసేన మహిళానేతలు బాగా యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. తమ తమ స్థానాల్లో ఉత్సాహంగా తిరిగుతూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వినికిడి. అంతేకాదు, గతంలో సీట్లు ఆశించిన కొందరు నేతలు కూడా సైలెంట్ అయిపోయి తమ భార్యలను బరిలోకి దించాలని అనుకుంటున్నారని, ఇప్పటికే దీనిపై కొందరు ఒక అభిప్రాయానికి వచ్చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.