అనంత‌పై ప‌వ‌న్ చిన్న‌చూపు?

పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు వినూత్నంగా  ఉన్నాయనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. మరోవైపు ఆయన రాజకీయాలు చేస్తున్న తీరు చూస్తుంటే అసలు ఆయనకు రాజకీయాలపై అవగాహన ఉందా అనే అనుమానాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని ఆ పార్టీలో చేరడానికి సీనియర్ రాజకీయ నాయకులు ముందుకు రావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలావుంటే ఒకప్పుడు రాయలసీమపై ఎంతగానో ప్రేమ చూపించిన పవన్.. ఈ మధ్య సీమపై దృష్టి పెట్టడం లేదన్నవాదన బలంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం కూడా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో పర్యటించి జనసేన పార్టీ ఇప్పడు అక్కడ పర్యటనలను బాగా తగ్గించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకే పవన్ కళ్యాణ్ ఎక్కువగా పరిమితం అయ్యారనే ప్రచారం కూడా జరగుతోంది. 
దీంతో పవన్ కళ్యాణ్ పై అనంతరపురానికి చెందిన జనసేన నాయకులు, పవన్ అభిమానులు అలక వహిస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న పవన్ ఇప్పటివరకు ఆ జిల్లాపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదని వారంటున్నారు. అప్పట్లో అనంతపురం జిల్లాపై బాగానే ఫోకస్ చేసినట్టు కనిపించిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత ఈ జిల్లాను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు. జిల్లాకు చెందిన నాయకులు ఎన్ని సార్లు కలిసి విన్నవించినా ఇటు వైపు రావడానికి ఆయన ఆసక్తి చూపడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు పవన్ కళ్యాణ్ కు అనంతపురంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే ఆలోచన ఉందా లేదా అని కూడా ఆరా తీస్తున్నారట. ఇక్కడ జనసేన పార్టీ బలపడితే మరికొందరు నాయకులు పార్టీలో చేరడానికి ముందుకొస్తారని, ఆ రకంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందని జిల్లాకు చెందిన జనసేన నాయకులు అంటున్నారట. అయితే పవన్ దగ్గర ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక లేకపోవడంతోనే ఇలా జరుగుతున్నదని వారు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పవన్ అనంతపురంపై దృష్టిసారిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.