టీడీపీ, బీజేపీల్లో ఒకరు అబద్దం ఆడుతున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కొద్దిగానైనా తెలిసొచ్చింది. టీడీపీ, బీజేపీలలో ఒకరు అబద్దం ఆడుతున్నారట. ఆ సంగతే చెప్పారాయన. ఇన్నాళ్లు అది తెలియక ఆలస్యం చేశానని మధన పడుతున్నారు. ఇటు జయప్రకాష్ నారాయణ, అటు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇద్దరితో మాట్లాడక కొన్ని విషయాల్లో తనకు క్లారిటీ వచ్చిందన్నారు. పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరాను. టీడీపీ అందుకు ఒప్పుకోలేదు. తాను అడిగినా ఇవ్వలేదంటే అనుమానపడాల్సిన అవసరం ఉందన్నారు. శ్వేతపత్రం ఎందుకు అంతా ఆన్ లైన్ లో ఉందని చెబుతున్నారు. తీరా అక్కడ చూస్తే అది లేదన్నారు. ఇదంతా డ్రామాగా కనపడుతుందంటున్నారు పవన్. మొత్తం మీద ఇన్నాళ్లకు పపన్ కు జ్ఞానోదయం అయిందనే చర్చ ప్రజల్లో సాగుతోంది.  
ప్రధానిగా నరేంద్రమోడీ, ఇటు అనుభవమున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే చాలా మేలు జరుగుతుందని భావించాడు పవన్. అందుకే 2014లో మద్దతు ప్రకటించాడు. ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది. ఇలాంటి సమయంలో ప్రతి చిన్న దానికి గొడవ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకని కొంత సంయమనం పాటించాననేది ఆయన వాదన. అంటే జరుగుతున్న తప్పులు తెలుస్తున్నాయి. కానీ మాట్లాడటం ఎందుకని అనుకున్నారట. 
ప్రత్యేక హోదా, హామీలు నెరవేర్చకపోవడంపై బీజేపీ తీరును తప్పు పడుతున్నారు పవన్. అన్ని రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువే ఇచ్చామని కేంద్రంలోని భాజపా చెబుతోంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సినవేవి సక్రమంగా రావడంలేదని అంతా అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్రం చెబుతోంది. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. ఎవరో ఒకరు అబద్దం ఆడుతున్నారని అర్థమవుతోంది. అందుకే నిజా నిజాలను చూసే ప్రయత్నం చేస్తున్నాడు పవన్. లెక్క తేలాక వాటిపై మాట్లాడేందుకు జనసేన అధినేత సిద్దం కావడం ఆసక్తికరంగా మారింది. 

1 Comment

  1. పవన్ ను చూస్తే జాలి వేస్తోంది. టీడీపీ కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కానీ పచ్చి అబద్ధాలు ఆడు తున్న బీజేపీ, టీడీపీ నీ ఒకే తాటపైకి తేవటం తప్పు. ఉదాహరణకు, రోడ్డు అభివృద్ధికి బీసీ లక్ష బీసీ కోట్లు అన్నారు. లక్ష కోట్లు ఇచ్చారా? 3000 కోట్లు ఇచ్చి, లక్ష కోట్లు ఇచ్చామని లెక్క ఎలా చెబుతారు? సెంట్రల్ ఇన్స్టట్యూట్ లకు, 7500 కోట్లు ఎస్టిమేట్, ఇచ్చింది నాలుగు సంవత్సరాలు లో, 300 కోట్లు. మళ్లీ, లెక్క 7500 కోట్లు ఇచ్చినట్లుగా లెఖ్ఖ. ఇట్లాంటి లెక్కలు ఎన్నో?ఇవన్నీ పాపం, పవన్ కి తెలియవా? ఉండవల్లి లాంటి వూసరవెల్లి నీ పక్కన పెట్టుకొన్నారు. ఇంకా నీకు creditibility ఎక్కడ ఉంటుంది?

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.