భయపడుతున్న పవన్ కల్యాణ్ 

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. పార్టీలే కాదు.. ప్రజలు, నటులు, నేతలు స్పందిస్తున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికీ సరిగా స్పందించలేదు. కేంద్రం తీరును విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఫలితంగా పవన్ కల్యాణ్ కు జనాల సమస్యల కంటే తన వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమనే ప్రచారం వస్తోంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటున్నాడు. కానీ ఆపని చేయలేకపోతున్నాడు. అధికార పార్టీలకు తొత్తుగా వ్యవహరించడం తప్ప ఆయన ఏం చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సినీనటుడు నిఖిల్ లాంటి వారికి కోపం వచ్చింది. కానీ పవన్ కు అవేం పట్టడం లేదు. బడ్జెట్ పై మాట్లాడాలని కోరినా ఏదో ముక్తసరిగా మానిపెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. 
తాను ఏం చెప్పదల్చుకున్నాడో అది చెప్పాడు తప్ప మరొక్క మాట మాట్లాడలేదు. త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడతానని సమస్యను దాటవేశాడు. ప్రశ్నించేవాడికి ధైర్యం కావాలి. కానీ ఆధైర్యం తనకు బాగా ఉందని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఎందుకు వెనక్కు తగ్గుతున్నాడో అర్థం కావడం లేదు. పార్లమెంటు వేదికగా… అన్ని రాజకీయ పార్టీలు తమ గళం వినిపిస్తున్నాయి. ఏపీలోనూ అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. కానీ పవన్  పార్టీ ఆ పని చేయడం లేదు. 
తిట్టివారితోనే కలిసిపోయే పవన్…
పవన్ కల్యాణ్ మాటలు, చేతలను గమనించిన వారికి అతను అసలు రాజకీయాలకు పనికిరాడనే చర్చ సాగుతోంది. కేసీఆర్ ను తిట్టాడు. ఆయన కంటే మంచి సి.ఎం లేరన్నారు. చంద్రబాబును తిట్టాడు. ఆయన పాలనలో సీనియర్ కాబట్టి మద్దతునిచ్చానంటున్నాడు. మోడీకి చేతకాదన్నాడు. కానీ అదే మోడీకి మద్దతు పలుకుతున్నాడు. వెంకయ్యనాయుడు వల్లనే ఏపీకి నష్టం జరిగిందన్నారు. ఇప్పుడు మాట మార్చారు. వ్యాపారం చేసుకోవడానికే ఎంపీలు పార్లమెంటుకు వెళుతున్నారన్నారు. ఇప్పుడు ఆ మాట చెప్పడం లేదు. విహెచ్ లాంటి వారి వల్ల ప్రజలకు కీడు జరుగుతుందన్నారు. అతన్ని కాంగ్రెస్ సి.ఎం అభ్యర్థిగా ప్రకటించాలన్నారు. ఇలా ఎవరినైతే అతను బాగా విమర్శించాడో.. వారితోనే కలిసిపోతున్నాడు పవన్ కల్యాణ్. అందుకే అతను రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదనే ప్రచారం వస్తోంది. మంచి నటుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రాజకీయాల్లో నటన చేస్తే కుదరదు కదా.   
మత్స్యకారులకు అండగా…
మత్స్యకారులను ఎస్టిలలో చేర్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. సముద్రంలో దిగి శాంతియుతంగా నిరసన చేస్తున్న బెస్తవారికి సి.ఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ మ్యానిఫెస్టోలో వారిని ఎస్టీల్లో చేరుస్తామని ప్రకటించింది. కానీ ఆచరణలో ఆ పని చేయలేకపోయింది. పైగా మత్స్యకారులను చంద్రబాబు తిట్టడంతో వారు తమ గోడును పవన్ కల్యాణ్ కు చెప్పుకునేందుకు వచ్చారు. అందుకే ఈనెల 21న శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయని ప్రస్తావించారు. ఆశ్చర్యం ఏంటంటే… వారంతా టీడీపీ అధినేత చంద్రబాబుపై పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేశారు. తమను అవమానించారని.. తమ సంగతి పట్టించుకోవడంలేదని చెప్పడం మరింత ఆశ్చర్యం. 
మత్స్యకారుల కుటుంబాలను ఎస్సీ, ఎస్టీల జాబితాలోకి చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వారిని అడ్డుకోవడం మంచిది కాదని ప్రభుత్వానికి హితవు పలికారాయన.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.