ప‌వ‌న్ ఎటూ తేల్చుకోలేక పోతున్నాడా!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోరుయాత్ర‌లో చాక‌చ‌క్యంగానే పోతున్న‌ట్టు క‌నిపిస్తున్నారు. అయితే.. ఎక్క‌డో ఏదో తేడా కొడుతుంద‌నే ఆలోచ‌న మాత్రం ప‌వ‌న్‌ను వెంటాడుతుంద‌ట‌. అయితే ఏదీ అనేదానిపై ఇప్ప‌టికైతే క్లారిటీ రాలేద‌ట‌. గ‌త‌నెల‌లో ఉత్త‌రాంధ్ర నుంచి ప‌ర్య‌ట‌నకు శ్రీకారం చుట్టిన ప‌వ‌ర్‌స్టార్ జ‌నాల్లోకి బాగానే చేర‌గ‌లిగారు. అదే స‌మ‌యంలో ఎమోష‌న‌ల్‌గా కూడా జ‌నాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్రను వేయించుకోగ‌లిగారు. అది ఓటు వ‌ర‌కూ వ‌స్తుందా! రాదా అనేది ప‌క్క‌న‌బెడితే.. ఎమోష‌న‌ల్‌గా ప‌వ‌న్‌తో గిరిజనులు క‌నెక్ట్ అయ్యార‌నే చెప్పాలి. సాధార‌ణ పౌరుడిగా పిల్లా, పెద్ద‌ల‌తో క‌ల‌సిపోవ‌టం కూడా యువ‌త‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తుంది. ఇవ‌న్నీ రాజ‌కీయంగా ఎంత‌వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నేది కూడా జ‌న‌సేన‌లో త‌లెత్తుతున్న అనుమానం. ఎందుకంటే.. ఆప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం అధినేత చిరంజీవి స‌భ‌ల‌కు జ‌నం తండోప‌తండాలుగా వ‌చ్చారు. అవ‌న్నీ ఓటుబ్యాంకుగా మార‌క‌పోవ‌టం వ‌ల్ల చిరు మ‌ళ్లీ వెండితెర‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. అదే అనుభ‌వం ప‌వ‌న్‌కు ఎదుర‌వ‌టం.. కాస్త అయోమయాన్ని క‌లిగిస్తుందంట‌. మ‌రో విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ ఎక్క‌డ నుంచి పోటీచేయాలి.. అప్ప‌ట్లో తాను అనంత‌పురం నుంచి బ‌రిలోకి దిగుతానంటూ చెప్పారు.
ఇప్పుడు కాదు.. అదంతా తూచ్‌.. ఉత్త‌రాంధ్ర‌కే ప్రాధాన్య‌త అంటున్నారు. అంటే.. ఆయ‌న రెండు చోట్ల నుంచి పోటీచేస్తారా అనేది మ‌రో సందేహం. ఎందుకంటే. తొలిసారి బ‌రిలోకి దిగేట‌పుడు ముందుచూపు రెండుసీట్లు అన్న‌మాట‌. గ‌తంలో చిరంజీవి కూడా పాల‌కొల్లు, తిరుప‌తి నుంచి బ‌రిలో నిలిచి తిరుప‌తి నుంచి గెలుపొందారు. ఇప్పుడు అదే దారిలో ప‌వ‌ర్‌స్టార్ కూడా రెండు చోట్ల పోటీకు దిగుతారా! అనేది చ‌ర్చ‌నీయాంశం. పొత్తు విష‌యంలో వామ‌ప‌క్షాలు.. మేమూ సేన‌తోనే అంటూ బ‌య‌ట‌కు చెబ‌ుతున్నారు. అయితే జెండాలు త‌ప్ప జ‌నం లేని.. ఎర్ర‌పార్టీల‌తో పొత్తు త‌న‌కు ఎంత వ‌ర‌కూ క‌ల‌సివ‌స్తుంద‌నేది కూడా ప‌వ‌న్‌ను ఇరుకున పెడుతున్న అంశ‌మ‌ట‌. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త్రిముఖ పోటీ అంటున్నా.. ఐదు పార్టీల మ‌ధ్య తెలియ‌ని యుద్ధం జ‌రుగుతుంద‌నే చెప్పాలి. గెలిచిన త‌రువాత మాత్ర‌మే.. ఎవ‌రు ఎవ‌రితో క‌ల‌వాల‌నేది తేల్చుకుంటారు. ఎందుకంటే.. ఏ పార్టీ ఏ పార్టీతో క‌ల‌సినా .. ఓట‌రు ఎలా స్వీక‌రిస్తార‌నే భ‌యం కూడా పార్టీల‌ను.. అధినేత‌ల‌ను వేధిస్తుంది. ఇటువంటి స‌మ‌యంలో ముఖ్య‌మైన పార్టీలు ఆచితూచి అడుగులేస్తున్నాయి. అయితే.. ప‌వ‌న్‌లో అది ఇంకాస్త ఎక్కువ‌గా ఉండ‌ట‌మే ఇక్క‌డ అస‌లు విష‌యం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.