పవన్ యాత్రకు రంగం సిద్దం

ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనతో ఎవరికి వారే నేతలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఆ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రజల వద్దకే పాలనలా జన్మభూమి కార్యక్రమాలు చేసింది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించింది. అంతే కాదు..సైకిల్ యాత్రను అన్ని గ్రామాల్లో చేయనుంది. వైకాపా అధినేత ఇప్పటికే మహా సంకల్ప యాత్ర చేస్తున్నా సంగతి తెలిసిందే. తొలి రోజుల్లో జనం బాగా వచ్చినా…ఆ తర్వాత అసలు జగన్ యాత్ర జరుగుతుందా లేదా అనే అనుమానం వస్తోంది. మీడియా పెద్దగా ప్రచారం ఇవ్వడం లేదు. 
పవన్ వస్తున్నాడట…
ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ యాత్ర చేయనున్నాడు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లోను ఆయన యాత్ర సాగనుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించనున్నట్టు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో కొండగట్టు వద్ద ప్రమాదం నుంచి  బయట పడ్డారు పవన్. అందుకే అక్కడ నుంచే తాను యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి. అందుకే తన రాజకీయ అప్రతిహత యాత్రను కొండగట్టు నుంచి  ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
సర్వమత ప్రార్ధనల తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం బయల్దేరతాడట. వైకాపా అధినేత జగన్ ఇలానే ఇడుపుల పాయలో సర్వమత ప్రార్థనలు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా హిందూ దేవాలయాన్ని సందర్శించిన ఆయన ఆ తర్వాత కడప దర్గాను సందర్శించారు. చివరిగా చర్చికి వెళ్లి వచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అన్ని మతాలు, కులాలను కలుపుకుపోయేందుకు పావులు కదుపుతున్నారు. ప్రజల వద్దకు వెళ్లే పవన్ వారితో మాట్లాడి సమస్యలను అధ్యయనం చేయనున్నారు. అందుకే తన యాత్రకు మద్దతు పలకాలని పవన్ కోరారు. తన రాజకీయ యాత్ర వివరాలను, ప్రణాళికలను కొండగట్టులోనే ప్రకటించనున్నాడు పవన్. ఈ మేరకు ట్వీట్‌ చేసిన పవన్‌ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఫొటోను పోస్ట్‌ చేశారు.
రెండు రాష్ట్రాల్లో తన కమిటీలను సిద్దం చేసుకున్న పవన్ ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగనున్నారని తెలుస్తోంది. అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ తో వారం రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన పవన్ ఇప్పుడు యాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ముందుగా తెలంగాణ సి.ఎం కేసీఆర్ ను కలిశారని తెలుస్తోంది. రాబోయే కాలంలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ఆలోచన పవన్ చేస్తున్నాడంటున్నారు. ఇంకోవైపు కొండగట్టు వద్దనే తన పార్టీ ప్రణాళికలను ప్రకటించనుండటం ఆసక్తికరంగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.