ప‌వ‌న్ సారూ… ‘ఏం సేస్తిరి ఏం సేస్తిరి’?

‘గబ్బర్గసింగ్’ సినిమాలోని ఓ కమెడియన్… ఒక హీరోను ఇమిటేట్ చేయడం… దానికి పవన్ కళ్యాణ్ ఆ హీరో స్టయిల్లో ‘ఏం సేస్తిరి ఏం సేస్తిరి’ అంటూ సెటైర్ వేయ‌డం అంద‌రికీ తెలిసిందే… అయితే ఇప్పుడు అదే ‘ఏం సేస్తిరి ఏం సేస్తిరి’ డైలాగ్ ప‌వ‌న్ విష‌యంలో రివ‌ర్స‌వుతోంది. ఉద్దండులైన నేత‌ల‌కు సైతం ప‌వ‌న్ వైఖ‌రి మింగుడు ప‌డ‌టం లేదు. దీంతో ప‌వ‌న్ ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో ఏమీ తెలియ‌డం లేదు. ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ తెలుగుదేశం పార్టీపై విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకే అని కొంద‌రంటుండ‌గా, తెలుగుదేశానికి బల‌మైన‌ ప్రత్యర్థిగా అవతరించేందుకే ఇలా చేస్తున్న‌ర‌న్న చర్చ కూడా జరుగుతోంది. ఇన్నాళ్లూ తెలుగుదేశంపై చేయ‌ని ఆరోపణలు.. ఇప్పుడే ఎందుకు చేస్తున్నార‌న్న‌ అనుమానం కూడా స‌ర్వ‌త్రా వ్యక్తమవుతోంది. కాగా దక్షిణ భారత రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం మొదటి నుంచి చిన్న చూపే చూస్తోంది. ఈ విషయాన్ని చాలా కాలంగా పవన్ చెబుతూనే ఉన్నారు. ఇటీవ‌ల ఈ విష‌య‌న్ని మరింత స్పష్టంగా వ్య‌క్తం చేశారు. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష కూడా చేస్తానని ప్రక‌టించారు కూడా! ఇంత‌లోనే టీడీపీని ఇలా విమ‌ర్శిస్తార‌ని ఎవరూ ఊహించలేదు. ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా విప‌రీత‌మైన చర్చ జరుగుతోంది. దీంతో ప్రజలే పవన్ కు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆగస్టు 14న మేనిఫెస్టో ప్రకటిస్తానని చెబుతున్న పవన్ అసలు టార్గెట్ ఏమిటి? అనేది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. అయితే ప‌వ‌న్ లేదా కాల‌మే దానికి స‌మాధానం చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.