పవన్ ల‌క్ష్య‌మేమిటి…..

సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చేశాడు. తెలంగాణ‌లో మొద‌లుపెట్టి ఆ త‌రువాత ఏపీ, రాయ‌ల‌సీమ‌లో కొన్ని ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న యాత్ర‌ను ఆపి ఏపీ విభ‌జ‌న హామీల విష‌యంలో బిజీగా ఉంటున్నాడు. భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణను సిద్దం చేసుకుంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీపై త‌న అక్క‌సును వెల్ల‌గ‌క్కారు. అంతే కాకుండా ఎన్‌డిఎ పై విమ‌ర్శ‌ల అస్త్రాలు సంధించారు. అనంత‌రం విభ‌జ‌న హామీలపై పోరాటం చేసేందుకు ఓ వేదిక‌ను సిద్దం చేసే ప‌నిలో ప‌డ్డార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇప్ప‌టికే లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ తో చ‌ర్చించారు. ఆదివారం ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ త‌రువాత మ‌రి కొంత మందిని క‌లిసే ప‌నిలో ప‌డ్డాడు. కేంద్రం ఆయ‌న చేసే పోరాటానికి వైసీపీ, కాంగ్రెస్‌లు కూడా మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. అయితే ప‌వ‌న్ ల‌క్ష్య‌మేమిట‌నేది ఇంత వ‌ర‌కు క్లారిటీ రాలేదు. తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ సీఎం కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. దీన్ని బ‌ట్టి జ‌న‌సేన తెలంగాణ లో పార్టీ నామ‌మాత్రంగా నే ఉంటుంద‌ని తేలిపోయింది. ఏపీలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ టీడీపీలో పేరొందిన నేత‌లంద‌రిని క‌లిసారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను క‌లుసుకొని వారితో స‌మావేశ‌మ‌య్యారు. ఇక్క‌డితే ఆయ‌న టీడీపీతో క‌లిసి ప‌నిచేస్తార‌ని  వాద‌న‌లు వినిపించాయి. బ‌డ్జెట్ త‌రువాత ప‌వ‌న్ హ‌ఠాతు్త‌గా  స్టాండ్ మార్చుకున్నాడు. బీజేపీతో పాటు టీడీపీకి వ్య‌తిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ద‌మ‌వ‌తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీయేత‌ర  శ‌క్తుల‌ను ఏకం చేసే ప‌నిలో ప‌డ్డ‌ట్టు ప్ర‌స్తుత ప‌రిణామాలు బ‌ట్టి తెలుస్తోంది. 2020 లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు… స్ట్రాట‌జీ ఏంటి అనేదానిపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో రాజకీయ పార్టీలు ప‌వ‌న్ ల‌క్ష్య‌మేమిటి అంటూ చ‌ర్చిస్తున్నారు. నిజ‌మే ప‌వ‌న్ గోల్ ఎలా ఉంటుందో ప్ర‌స్తుతం ఊహించ‌డం క‌ష్టంగానే ఉంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.