కేసీఆర్ నుంచి అయినా నేర్చుకో ప‌వ‌న్!

బాగా వినేవాడు బాగా మాట్లాడ‌గ‌ల‌డు. చాలామందికి తెలియ‌న విష‌యం ఏంటంటే… కేసీఆర్ మోనార్క్‌, మాట‌ల‌తో అంద‌రినీ ప‌డ‌గొట్టేస్తాడు. సామాన్యుడు కాదు అనుకుంటారు. కానీ కేసీఆర్ ప్ర‌తి ప్ర‌సంగం వెనుక పెద్ద హోంవ‌ర్క్ చేస్తార‌ట‌. ఆయ‌న అనేక మార్గాల నుంచి స‌మాచారం సేక‌రిస్తార‌ట‌. స‌మాచారం కోసం పెద్ద‌ల‌తో, సామాన్యుల‌తో కూడా మాట్లాడిన త‌ర్వాత‌, ఇత‌ర మార్గాల్లో వీలైనంత స‌మాచారం సేక‌రించిన త‌ర్వాతే ఆయ‌న అలాంటి వాగ్దాటితో మాట్లాడ‌గ‌లుగుతారు.
కేసీఆరే కాదు ఎవ‌రైనా హోంవ‌ర్క్ చేయాల్సిందే. ఇన్‌పుట్ ఉంటేనే అవుట్‌పుట్ ఉంటుంది. ప‌వ‌న్ స‌మ‌స్య ఇదే. ఏమీ తెలుసుకో్డు. త‌న‌కు అంతా తెలుసు అనుకుంటాడు. ఎవ‌రితో స‌మాచారం తెలుసుకోడు. చుల‌క‌న అవుతామేమోన్న ఇన్‌ సెక్యూరిటీ. అందుకే మాట పెగ‌ల‌దు. విష‌యం ఉండ‌దు. త‌ప్పు మాట్లాడినా స‌ర్దిచెప్పుకునే గుణ‌మూ లేదు. ఈరోజు ప‌వ‌న్ ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే నెటిజ‌న్లు వాయించి ప‌డేస్తున్నారు.
గతంలో హైదరాబాద్‌ని అభివృద్ధి చేసి దెబ్బతిన్నామని.. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు అదే బాటలో అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ మాట ప‌వ‌న్‌లోని అవ‌గాహ‌నా రాహిత్యాన్ని తెలియ‌జేస్తుంది. అమ‌రావ‌తిని క‌ట్టొద్ద‌ని అస‌లు అమ‌రావ‌తి అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు ప‌వ‌న్‌. బాంబే, హైద‌రాబాద్‌, చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు కోట్లాది మందికి ఉపాధిని ఎలా ఇవ్వ‌గ‌లుగుతున్నాయి. స‌క‌ల స‌దుపాయాలు దొరికిన చోటే ఉపాధి అయినా, ఉద్యోగ‌మైన పుడుతుంది. ఒక రాజ‌ధాని లేక‌పోతే ఆ రాష్ట్రానికి క‌నీస గుర్తింపు కూడా ఉండ‌దు. హైద‌రాబాదు అభివృద్ధి చేయ‌క‌పోతే ఇన్ని ల‌క్ష‌ల మందికి ఉపాధి దొరికేదా? బెంగుళూరు అభివృద్ధి కాక‌పోతే అంత‌మంది బాగుప‌డేవారా? ప‌వ‌న్ ఏం మాట్లాడుతున్నాడో్ ప‌వ‌న్ క‌యినా అర్థ‌మ‌వుతోందా?
అమ‌రావ‌తిని ఒక పీపుల్స్ సిటీ చేయాల‌ని బాబు నిర్ణ‌యిస్తున్నారు. ఇంకా అక్క‌డికి ప‌రిశ్ర‌మ‌లు తేలేదు. ఒక న‌గ‌రానికి ఆయువు ప‌ట్టు ప‌రిశ్ర‌మ‌లు కాదు… లైఫ్‌స్టైల్‌. దానిని అభివృద్ధి చేస్తున్నారు చంద్ర‌బాబు. మౌలిక స‌దుపాయాలు, వినోదం… వీటిని అభివృద్ధి చేస్తున్నారు చంద్ర‌బాబు. కియాను అనంత‌పురం తీసుకెళ్లారు. భారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను చిత్తూరుకు తీసుకెళ్లాడు. మొబైల్‌, టెక్నాల‌జీ ప‌రిశ్ర‌మ‌ల‌ను వైజాగ్, నెల్లూరు జిల్లాకు తీసుకెళ్తున్నాడు. గోదావ‌రికి జాతీయ ప‌రిశ్ర‌మ‌లున్నాయి. ఉత్త‌రాంధ్ర‌కు ఎయిర్‌పోర్ట్ హ‌బ్ వ‌స్తోంది. క‌డ‌ప‌కు ఉక్కు వ‌స్తోంది, క‌ర్నూలుకు విమానాశ్ర‌యం ఇంకా ఓర్వ‌క‌ల్లు ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా వ‌స్తోంది. కానీ… లైఫ్‌ను మాత్రం అమ‌రావ‌తిలో పెడుతున్నారు. ప్ర‌పంచానికి చూపించ‌డానికి మ‌న‌కు ఓ న‌గ‌రం కావాలి. అదే అమ‌రావ‌తి. అది వందేళ్ల విజ‌న్‌. ప‌వ‌న్ కి అర్థం కాదు, తెలుసుకోడు. దీంతో త‌న అవ‌గాహ‌న రాహిత్యంతో ఏదేదో మాట్లాడి నెట్టింట్లో ట్రోల్ అవుతాడు. ఆయ‌న్ను మార్చే వారు ఎవ‌రూ లేరు.

1 Comment

  1. రెండు లక్షల పుస్తకాలు చదివిన మేధావి జ్ఞానం ఇలాగే ఉండి ఏడుస్తుంది.వీళ్లకు ముఖ్యమంత్రి పదవి మీద యావ తప్ప కేంద్రలోని ప్రభుత్వాల కుటీలత్వాలకు దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలి అనే అవగాహన, అనుభవం కాసింతైన లేవు. వీళ్ళను నమ్మితే మనం కూడా తిరోగమంలో పడి యాభై ఏళ్ళ వెనక్కి వెళ్లి అందరం అజ్ఞాన వాసులైపోతాం.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.