ఏకుల‌మూ నీదంటే… ఫ‌లానా పార్టీ కుల‌మ‌నేలా ఉన్నారు

వివిధ పార్టీల‌లో కులాల కుమ్ములాట‌లు తారాస్థాయికి చేరాయి. నిన్మ‌మెన్న‌టి వ‌ర‌కూ ఎన్నికల వాగ్ధానాలు, పాలనా అంశాల‌పై టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్యుద్ధం న‌డిచింది. ఇప్పుడది కొత్త‌మ‌లుపు తిరిగింది. పలానా కులం ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారంటూ ప‌ర‌ర్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. కాపు వర్గం ఓట్లే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాడంటూ పవన్‌ను ఆ వర్గానికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపై పవన్ ఘాటుగా స‌మాధానమిచ్చారు. జనసేనపై కులం ముద్ర వేస్తే, కాళ్లు విరగ్గొడతానంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పార్టీలనే తీసుకుంటే, ఒకప్పుడు కాంగ్రెస్‌లో రెడ్డి సామాజికవర్గం బ‌లంగా కనిపించేంది. ఇప్పుడా వర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైపు మళ్లింది. తెలుగుదేశం కూడా, ఎన్టీఆర్‌ హయాం నుంచి కమ్మ వర్గం ప్రాబ‌ల్య‌మే క‌నిపిస్తోంది. దీంతో ఏపీలో కమ్మ, రెడ్డిల మధ్య అధికార మార్పిడి జరుగుతుంటుందని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతుంటారు.. ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ, రెడ్ల తర్వాత, అత్యంత బలమైన మరో సామాజికవర్గం కాపు అని చెప్పుకోవ‌చ్చు. కమ్మరెడ్ల అధికారం మార్పిడీ అవుతున్నా, ఇఫ్పటివరకు కాపు వర్గానికి అధికారం దక్కలేదు. అయితే 2008లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన చిరంజీవి కాపుల‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు ప్రయత్నించారు. చిరంజీవికి అన్నివర్గాల అభిమానమున్నా, ఆయనను మాత్రం కాపు వర్గం త‌మ‌వాడని ప్ర‌క‌టించుకుంది.
మ‌రోవైపు ఎస్సీ, బీసీలు చిరువైపు మళ్లకుండా, నాడు కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై కాపు ముద్ర వేశాయి. చిరంజీవికి  ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి. అక్కడ‌ కాపు ఓట్లు అధికంగా ఉంట‌డ‌మే అందుకు కార‌ణం. అయితే నాడు ప్రజారాజ్యంపై ఎలాంటి కులం ముద్ర వ్యూహం వేశారో, ఇప్పుడు జనసేనపైనా అలాంటి క్యాస్ట్‌ మార్క్ వేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. కాగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పవన్ కల్యాణ్ మద్దతిచ్చారు. అప్పటికే జనసేనను స్థాపించినా, ఓట్ల చీలిక వద్దన్న ఆలోచనతో  వ‌ప‌న్‌… మోదీ, బాబులకు మద్దతిచ్చేందుకే పరిమితమయ్యారు. దీంతో ఆ ఎన్నికల్లో పనవ్ రాకతోనే, కాపు ఓట‌్లన్నీ తెలుగుదేశానికి పడ్డాయనే ప్ర‌చారం జ‌రిగింది. రాష్ట్ర విభజనతో ఏపీలో అతిపెద్ద కులంగా కాపులు నిలిచారు. ఏపీ జ‌నాభాలో 17 శాతం కాపులున్నారని ఒక అంచ‌నా. అంతకంటే ఎక్కువే ఉండొచ్చని కాపు సంఘాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. మరోవైపు కాపుల తర్వాత ఏపీలో అత్యధికులు ఎస్సీలు. కాగా టీడీపీకి బీసీలే వెన్నెముకగా ఉంటున్నారు. దీంతో జనసేనపై కాపుముద్ర వేసి, ఎస్సీలు, బీసీలను దూరం చేయాలన్నది కూడా తెలుగుదేశం వ్యూహంగా కొందరు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం వ్యూహాన్ని అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్, తనను ఒకే వర్గానికే పరిమితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందుకే తాను అన్ని వర్గాలకు చెందినవాడనని, తనకు కులపిచ్చిలేదని, అందరూ తనకు సమానమేనని ప‌దేప‌దే చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.