జగన్, పవన్ ఒక్కటేనని పెద్దాయన టాక్!

రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇద్దరిదీ ఒకటే టార్గెట్అట! అదే… ఎలాగైనా సరే చంద్రబాబును ఓడించాలి. దానికోసం ఏం చెయ్యడానికైనా వారు సిద్ధమవుతున్నారట, ఈ విషయాన్నివారే పలుమార్లు చెప్పారని అంటున్నారు. గత ఎన్నికల్లో చంద్ర బాబుతో కలసి మోడికి మద్దతుగా పవన్ నిలిచారు. అదే క్రమంలో 2014 ఎన్నికల్లో బాబుని గెలిపించింది తానే అన్నట్లుగా మాట్లాడారు కూడా. అయితే పవన్ వల్ల టీడీపీ లాభపడిందా? లేక నష్ట పోయిందా అన్న లెక్కలు పక్కన పెడితే, టీడీపీ గెలుపులో పవన్ బలమైన పాత్ర పోషించారనేది విదితమే!. మరోవైపు అటు పవన్ ని, ఇటు జగన్ ని ఇద్దరినీ బీజేపీ ఆడిస్తున్నదనేవార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇటు పవన్, అటు జగన్ ఇద్దరూ కలసి బాబు టార్గెట్ గా ముందుకు సాగనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇదే విషయంపై ఎప్పటినుంచో అనేక చర్చలు కూడా నడుస్తూనే ఉన్నాయి. పవన్, జగన్ కలసి పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ కలసి బరిలో దిగడానికి సిద్దంగా ఉన్నారని ఆ రెండు పార్టీల వర్గాల్లో బలమైన చర్చ నడుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటువంటి వార్తల నేపధ్యంలో గతంలో వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తన మద్దతు జగన్ మోహన్ రెడ్డికే ఉంటుందని పవన్ కళ్యాణ్ తనతో చెప్పారని ఆయన అంటున్నారు. అయితే అతని మాటలు ఇంతటితో అగిపోలేదు, ఆయన తాజాగా మరో మారు అలాంటి వ్యాఖ్యానాలే చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయని, త్వరలో రెండు పార్టీలు కలుస్తాయని, ఇప్పటికే అనధికారికంగా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని అన్నారు. అయితే ఇది త్వరలో అధికారికంగా కూడా మారనుందని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాలు చూస్తూంటే పవన్ వామపక్షాలతో కలిసి ముందుకు వెళుతూనే,  వైకాపాతో దోస్తీకి సిద్దం అవుతున్నారనే కొత్త వాదన మొదలైంది. అయితే ముందుముందు ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.