ఎటూ తేల్చుకోలేని ప‌వ‌న్‌!

వైసీపీ త‌ప్పిదాలు.. జ‌న‌సేన‌కు అనుకూలంగా మారాయి. ఓ విధంగా.. పార్టీను బ‌లోపేతం చేసేందుకు ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు ఇవ‌న్నీ ఉప‌యోగ‌ప‌డేవి కూడా. అయినా.. జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం.. ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. దీంతో.. ప‌వ‌న్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న త‌మ‌కు అనుకూల‌మంటూ.. మ‌రోవైపు టీడీపీ జ‌బ్బ‌లు చ‌ర‌చుకుంటోంది. మూడుముక్క‌లాట‌గా సాగిన ఏపీ రాజ‌కీయం.. భ‌లే ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. వైసీపీలో ఏళ్ల‌త‌ర‌బ‌డి కొన‌సాగుతున్న నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల‌కు జ‌గ‌న్ ఊహించ‌ని షాక్‌లిస్తున్నాడ‌ట‌. ఈ మ‌ధ్య‌నే.. రాజ‌కీయ వ్యూహ‌కర్త‌గా ఇంట్లో ఉంచి పోషించిన ప్ర‌శాంత్‌కిషోర్‌ను.. అదేనండీ.. వైసీపీ పీకేను సాగ‌నంపారు. జ‌గ‌న్ టార్చ‌ర్ భ‌రించ‌లేక‌నే.. పీకే ప‌లాయ‌నం చిత్త‌గించాడ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్త‌వాల‌ను చెప్ప‌టం వ‌ల్ల జ‌గ‌న్ పీకేకు క్లాసు తీసుకుని బెదిరించాడ‌నే ప్ర‌చార‌మూ లేక‌పోలేదు. ఇటువంటి స‌మ‌యంలో జ‌గ‌న్‌.. కాపుల‌నూ ప‌క్క‌న‌బెడుతున్నారు. ఒక‌రిద్ద‌రికి ఇప్ప‌టికే సంకేతాలు చేరాయ‌ట‌. మీకు అసెంబ్లీ వ‌ద్దు. ఎంపీగా పోటీచేద్దురువుగానంటూ.. కాపు నాయ‌కుల్లో కీల‌క‌మైన న‌లుగురుని ఒప్పించే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయ‌ట‌.
అక్క‌డ త‌మ‌కు అనుకూల‌మైన నేత‌ల్ని ఉంచ‌టం ద్వారా.. 2019లో గెలిస్తే.. కీల‌క ప‌ద‌వులు వారికే క‌ట్ట‌బెట్టేందుకు జ‌గ‌న్ న‌డిపిస్తున్న డ్రామాగా ఆ పార్టీ శ్రేణులే భావిస్తున్నాయి. డ‌బ్బు.. కుమ్మ‌రించే సత్తా ఉన్న‌వారికి మాత్ర‌మే ఎమ్మెల్యే సీట్లంటూ తెగేసి చెబుతున్నార‌ట‌. పైగా పార్టీ ఫండ్ కోసం భారీగానే డిమాండ్ చేస్తున్నార‌ట‌. మా వ‌ల్ల కాదంటే.. ప‌ర్లేదు.. అప్పు చేయండి.. రేపు మ‌నం అధికారంలోకి వ‌స్తే.. ఇంత‌కు ప‌దిరెట్టు సంపాదించుకునే అవ‌కాశం ఉంద‌ని ఆశ‌చూపుతున్నార‌ట‌. దీంతో కొంద‌రు సీనియ‌ర్లు పార్టీ వీడి.. ప‌వ‌న్ వైపు వెళ్లాల‌నుకుంటున్నార‌ట‌. అయితే.. ప‌వ‌న్ మాత్రం.. పాత‌వారిని పార్టీలోకి తీసుకోవ‌టం.. ద్వారా త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌నే భ‌య‌ప‌డుతున్నార‌ట‌. కాపు నేత‌ల‌కు కండువాక‌ప్పితే.. ఇక‌.. జ‌న‌సేన కుల‌పార్టీ అనే ముద్ర‌ను బ‌ల‌ప‌రిచిన‌ట్లు అవుతుంద‌నే ఆందోళ‌న కూడా ఉంద‌ట‌.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.