ప‌వ‌న్ త‌డబాటు.. వెనుక‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. కాస్త ప‌రిణితి సాధించాడు. ఇప్పుడిపుడే  రాజ‌కీయం అర్ధ‌మ‌వుతుంది. పైగా.. అంతా త‌న చెప్పుచేతుల్లోనే ఉండ‌ద‌నే విష‌యం బోధ‌ప‌డిన‌ట్టుంది. ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తానేదో రాజ‌కీయాల‌ను మార్చాల‌నుకుంటే.. అదంతా ఈజీ కాద‌నేది అర్ధ‌మైన‌ట్టుంది. అంద‌రూ వెళ్లేదారిలో వెళితే.. క‌నీసం ప‌రవు ద‌క్కుతుంద‌నే విష‌యం తెలిసింది. అందుకే.. నా రూటు స‌ప‌రేటు అని గాకుండా.. నా రూటు.. మీ రూటే అనేంత‌గా మారిపోతున్నారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు.. ఆధారాల్లేకుండా ఆరోప‌ణ‌లు తెగ చేసేస్తున్నారు. ప‌వ‌ర్ వ‌ద్దంటూనే.. ప‌వ‌ర్ ఇస్తేనే ఏదైనా చేయ‌గ‌లిగేది అంటూ… చంద్ర‌బాబు, జ‌గ‌న్ బాట‌లోకి చేరాడు.. కానీ.. కిందిస్థాయిలో కేడ‌ర్ పై స‌రైన ప‌ట్టురాక‌.. త‌డ‌బ‌డుతున్నారు. పైగా.. లోక‌ల్ నేత‌లు ఎవ‌ర‌నేదానిపై ఇప్ప‌టికీ క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతున్నారు. ఎవ‌రికి వారు.. నేనేనాయ‌కుడిని అంటూ  కాల‌రెగ‌రేస్తూ జెండాలు ప‌ట్టుకోవ‌టంతో తంటా మొద‌లైంది. స‌రైన వ్య‌వ‌స్థాప‌న లేక‌పోవ‌టం.. గ్రౌండ్‌లెవ‌ల్లో ఎవ‌ర్ని ఉంచాలి.. ఎవ‌రు స‌మ‌ర్థులు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ధీటుగా నిల‌బ‌డి త‌ల‌బ‌డే వారెవ‌ర‌నేది ఇప్ప‌టికీ అర్ధంకాక‌.. జ‌న‌నేత అయోమ‌యంలోనే ఉన్నారు. ఇక స‌భ‌ల‌కు వ‌చ్చే జ‌నాన్ని.. ప‌దేళ్ల‌క్రిత‌మే ప్ర‌జారాజ్యం పార్టీ స‌మ‌యంలోనే చూశాడు.
కాబ‌ట్టి.. స‌భ‌ల‌కు వ‌చ్చే జ‌నం.. జేజేలు కొట్టే అభిమానులు ఎంత వ‌ర‌కూ పోలింగ్ బూత్ వ‌ర‌కూ వ‌స్తార‌నేది కూడా మ‌రో సందేహం.  కొద్దిరోజులుగా ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల్లో వ‌ల‌స‌లు పెరిగాయి. మాజీలు, ప‌క్క‌పార్టీలు సీటు గ్యారంటీ లేని నేతలంతా జ‌న‌సేన కండువా క‌ప్పుకునేంద‌కు రెడీ అవుతున్నారు. అయితే.. వీరంతా కేవ‌లం అవ‌త‌లి పార్టీల‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకా.. నిజంగా ప‌వ‌న్ వైపు నిల‌బ‌డేందుకా అనేది కూడా అనుమాన‌మే. కొత్త నేత‌లు వ‌స్తే.. ఇన్నాళ్లు పార్టీ జెండాలుమోసిన త‌మ ప‌రిస్థితి ఏమిట‌నే ప్ర‌శ్న లోక‌ల్ జ‌న‌సేన నేత‌ల్లో వ‌స్తే.. ఎలా అనేది  అధినేత ప‌వ‌న్ ఆందోళ‌న‌.  ముంచుకు వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు ప‌లుక‌రిస్తాయో తెలియ‌దు. పైగా.. అటు జ‌గ‌న్‌, ఇటు చంద్ర‌బాబు ఇద్ద‌రూ బ‌ల‌మైన నేత‌లు.. పైగా క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ ఉన్నపార్టీలు.. అంగ‌బ‌లం. అర్ధ‌బ‌లంతో పాటు.. రాజ‌కీయాల‌ను చేయ‌గ‌ల నేర్ప‌రులు.. పైగా ఇరు పార్టీల గుర్తులు కూడా జ‌నానికి చేరువ‌య్యాయి. కానీ.. జ‌న‌సేన పార్టీ గుర్తు ఏమిట‌నేది ఇప్ప‌టికీ కార్య‌క‌ర్త‌ల‌కూ తెలియ‌ని దుస్థితి. ఇటువంటి విప‌త్క‌ర వేళ ప‌వ‌నుడు.. అభిమ‌న్యుడుగా మార‌తాడా.. అర్జునుడిగా విజేయుడిగా నిలుస్తాడా.. అదే.. ఇప్పుడు ప‌వ‌న్ త‌డ‌బాటుకు కార‌ణ‌మ‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.