ప‌వ‌న్‌.. ఫ్రంట్ నిజ‌మేనా!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్.. ఇప్పుడు నిజంగా రాజ‌కీయ నాయ‌కుడిగా క‌నిపిస్తున్నాడంటూ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మాట‌ల వెనుక ఏమున్నా.. అది నిజ‌మే అనిపిస్తుంది. అప్ప‌ట్లో.. ఓ సినిమా లో ప‌ర‌చూరి గోపాల‌కృష్ణ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ ప‌లుకుతారు. సీఎం భార్య చ‌నిపోతే.. వెళ్లాడ‌నుకో.. సీఎంకు రాష్ట్రం కంటే భార్యే ఎక్కువ అని విమ‌ర్శిస్తా. అదే.. భార్య వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌నుకో.. భార్య‌నే చూడ‌లేనోడు.. ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడ‌ని విమ‌ర్శిస్తాం… మేం రాజ‌కీయ నాయ‌కులం.. రా.. అంటే రావ‌ణాసురుడు, జ .. జ‌రాసంథుడు.. కీ.. కీచ‌కుడు.. యం.. య‌మ‌ధర్మ‌రాజు అంటూ రాక్ష‌సులంద‌ర్నీ ఒంట‌బ‌ట్టించుకున్న‌దే రాజ‌కీయం అంటూ. అర్ధం చెబుతాడు.  ముందు న‌వ్వాలి.. వెనుక గోతులు తీయాలి. తేనె పూసిన క‌త్తిలా ఉంటేనే.. ర‌స‌వ‌త్త‌ర‌మైన రాజ‌కీయాలు న‌డ‌ప‌గ‌లం అనేది చాలామంది సీనియ‌ర్ల ఆలోచ‌న‌… అనుభ‌వం కూడా.  కేసీఆర్ సూప‌ర్ అంటాడు.. చంద్ర‌బాబు మంచి ప‌నోడు అంటాడు. క‌విత చెల్లి బాగా మాట్లాడిదంటాడు.. వామ‌ప‌క్షాలే నా రాజ‌కీయాల‌కు ప్రేర‌ణ అంటాడు. నొప్పించ‌క‌.. తొనొచ్చ‌క త‌ప్పించుకు తిరుగువాడు అన్న‌ట్లుగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌ను న‌డిపేందుకు ప‌వ‌ర్ పాయింట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని నిజంగానే రాజ‌కీయాలు న‌డుపుతున్న‌ట్లుగానే విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్త ఉంటుందనేది ఇప్పుడే అంచ‌నా వేయ‌టం క‌ష్టం. అలాగ‌నీ.. అంద‌రినీ శ‌త్రువులుగా క‌ట్ట‌డం కూడా భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు డేంజ‌ర్‌బెల్స్ మోగించుకున్న‌ట్లే. అందుకే.. ఏపీ, తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీల్లో ఉంటూ.. మ‌చ్చ‌లేని నేత‌లుగా వున్న జ‌య‌ప్ర‌కాష్‌నారాయ‌ణ్‌, ఉండ‌వ‌ల్లి వంటి వారితో జ‌ట్టు  క‌ట్టేందుకు ప్ర‌త్యేక హోదా అంశాన్ని నిచ్చెన‌గా మ‌ల‌చుకోవ‌టంతో ప‌వ‌న్ విజ‌యం సాధించాడ‌నే చెప్పాలి. మ‌రో వైపు.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల లోపాల‌ను ప్ర‌జాముఖంగా ఎత్తిచూపుతున్నాడు. ప్ర‌జ‌ల అనుమానాల‌ను నివృతి చేయ‌మంటూ లెక్క‌లు కోర‌టం వెనుక వాస్త‌వం కూడా ఇదే. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు అబ‌ద్దం చెబుతున్నార‌నేది.. ప్ర‌జ‌ల‌కూ తెలిసిందే.. అయితే ఆ అబ‌ద్దం చెప్పేదెవ‌ర‌నేది.. ఇప్పుడు తేలాలి. ఒక వేళ కేంద్రమే ఆ త‌ప్పు చేస్తే.. టీడీపీ ఒడ్డున ప‌డుతుంది. జ‌న‌సేన ప్ర‌శ్నించినందుకే ఇది బ‌య‌ట‌కు పొక్కింద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళుతుంది. ఇద్ద‌రూ మౌనంగా ఉంటే.. ఇద్ద‌రూ త‌ప్పుచేశార‌నే భావ‌న‌తోపాటు.. సేనానికి మ‌ద్ద‌తు పెరుగుతుంది. కేంద్రం, రాష్ట్రంలోనూ రాజ‌కీయాలు.. సొంత‌పార్టీ బ‌లం కంటే.. ప్ర‌తిప‌క్ష పార్టీల బ‌ల‌హీన‌త మీద‌నే ఆధార‌ప‌డ్డాయి. ఇటువంటి స‌మ‌యంలో అధికార పార్టీల‌ను కాస్త బ‌ల‌హీనం చేసేలా.. ప‌వ‌న్‌.. క‌లిసొచ్చే వారితో కూట‌మి ద‌శ‌గా ఏమైనా అడుగులు వేస్తున్నాడా అనేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదే జ‌రిగితే.. 2009లో మ‌హాకూట‌మి స్థాయిలో.. ప‌వ‌న్‌ఫ్రంట్ తెర‌మీద‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.