ప‌వ‌న్‌కు పంచ్‌లిస్తున్న ప‌వ‌ర్ స్టార్ అభిమానులు?

ఎన్నికల త‌రుణం స‌మీపిస్తున్న కొద్దీ వైసీపీలో ఆందోళన పెరిగిపోతోంది. పాదయాత్ర పేరుతో పార్టీకి బ‌లం తీసుకొద్దామని ప్రయత్నిస్తున్న జగన్ కి అడుగ‌డుగునా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం పవన్ పార్టీ  జ‌గ‌న్‌కు చుక్కలు చూపించేలా త‌యార‌య్యంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.  చిరంజీవి ఎలాగైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓట్లు చీల్చారో, అదే విధంగా  ఇప్పుడు పవన్ ఓట్లు చీల్చి టీడీపీకి మేలు చేస్తాడనే ఆందోళన జగన్ లో కనిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మొన్నటివరకు పెద్దగా జనసేన ప్రభావం బ‌య‌ట కనిపించకపోవడంతో జగన్… ప‌వ‌న్ పార్టీని అంత‌గా ప‌ట్టించుకోలేదు.  కానీ ఇప్పుడు ప‌వ‌న్‌పార్టీ పుంజుకుంటున్న‌ట్లు కనిపించడంతో జ‌గ‌న్‌శ్రేణులు కంగారు పడుతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల పవన్‌ ఉత్తరాంధ్ర పర్యటనతో పాటు సాగరతీరంలో కవాతు ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు భారీగా జనాలు హాజరుకావడాన్ని జ‌ట‌న్ పార్టీ తట్టుకోలేకపోతోంద‌ట‌! అస‌లే త‌మ‌ పార్టీ విశాఖప‌ట్నం జిల్లాలో వెనుక‌బ‌డి ఉంద‌ని, ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌తో త‌మ‌కు ముప్పు ఏర్ప‌డుతుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. దీనికితోడు ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర‌లో రోజు రోజుకు ప‌ట్టు సాధిస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
దీంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు జ‌న‌సేన కు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని జ‌గ‌న్ పార్టీ ఆందోళ‌న‌లో ప‌డింద‌ట‌! గత ఎన్నికలలో తాము అధికారంలోకి రాకపోవడానికి పవన్ ప్రధాన‌ కారణమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికీ త‌ల‌చుకుంటుంటారు. దీంతో ఇప్పుడు  ప‌వ‌న్ వ‌ల‌న‌ అదే జరుగుతుందేమోనని ఆందోళన వైసీపీ శ్రేణుల‌ను వెంటాడుతోంది. తమకు ఇప్ప‌టికే ఉన్న ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా వస్తాయని వైసీపీ కోటి ఆశ‌లు పెట్ట‌కుంది. అయితే త‌మ ఆశ‌ల‌కు ప‌వ‌న్ గండికొడ‌తాడేమోన‌నే భ‌యం ఇప్పుడు ఆ పార్టీని  వెంటాడులోంది.  దీనికితోడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోనూ కొందరు పవన్‌ వీరాభిమానులు ఉన్నారు. వీరు జ‌గ‌న్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేని చోట  పవన్‌కు మద్దతు ప‌లుకుతామ‌ని ప‌రోక్షంగా చెబుతున్నారట! మొత్తానికి అన్నివైపుల నుంచి వైసీపీ ఓట్లకు గండి గొట్టడానికి పవన్ పార్టీ సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఇటీవల నిర్వహించిన సర్వే లో ఉత్తరాంధ్రలో టీడీపీ –  వైసీపీ మధ్య ఓట్ల తేడా నాలుగుశాతానికి పైగా ఉంది. దీనికితోడు ఉత్త‌రాంధ్ర‌లో కూడా జ‌న‌సేన‌ గణనీయంగా ఓట్లను సాధిస్తుందని ఆ సర్వేలో తేలింది. ఇదే  జగన్ శిబిరంలో ఆందోళన కు కార‌ణ‌మ‌వుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.