పవన్ కోసం ప్రాణం తీసుకున్నాడు

తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది సెలెబ్రిటీలకు ఫ్యాన్స్ ఉన్నారు కానీ.. వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేరు. అప్పట్లో సినిమా పరంగా ఆదరించిన వీళ్లే ఇప్పుడు జనసేనకు అండదండగా ఉన్నారు. తమ అభిమాన నటుడిని సీఎం చేయాలని కంకణం కట్టుకున్న ఫ్యాన్స్.. దాని కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇటీవల జరిగిన పవన్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. అశేషమైన అభిమానులను సంపాదించుకున్న పవన్.. వారు చేసే పనులతో ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాల్లో కంటే జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్.. తన అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. వారితో కలిసి మెలసి ఉంటున్నాడు. తన అభిమానులే బలంగా నమ్మే పవన్‌కు.. వారు బలహీన క్షణాల్లో చేసే పనులు ఆయనను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఇది ఎన్నోసార్లు రుజువైంది కూడా. ఎంతటి స్టార్ అయినా తన అభిమానులు చేసే పనులు ఒక్కోసారి చిక్కులను తెచ్చిపెడుతుంటాయి.. ఆవేదనను కలిగిస్తుంటాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. పవన్ కోసం ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయవాడ పెన్‌జోన్‌పేటలో నివాసం ఉంటున్న అనిల్ కుమార్‌కు పవన్ అంటే విపరీతమైన అభిమానం అని తెలుస్తోంది. గతంలో పవన్ సినిమాలంటే పడిచచ్చే అనిల్.. సినిమా రిలీజ్ రోజున పండుగలా జరుపుకునేవాడట. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, జనసేన పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో అనిల్ పాలుపంచుకునేవాడని, పలు బహిరంగ సభలకు బౌన్సర్‌గా కూడా వ్యవహరించాడని సమాచారం. కానీ, ఇటీవల కాలంలో జనసేనకు తాను ఏమీ చేయలేకపోతున్నానని బాధపడేవాడని, అదే విషయాన్ని తమకు చెప్పేవాడని కుటుంబసభ్యుల చెబుతున్నారు. జనసేన కోసం ఏదో ఒకటి చేస్తానని అనే అనిల్.. నిన్న ఇంట్లో ఉన్నవారందరూ బయటకు వెళ్లిన సమయంలో ఉరి వేసుకున్నాడని తెలిసింది. అంతేకాదు, ‘‘పవన్ కల్యాణ్ నా అంత్యక్రియల్లో పాల్గొనాలి. పవన్ కల్యాణ్ నా అభిమాన హీరో, అన్నయ్య, కుటుంబసభ్యుడు. నా ఆత్మకు శాంతి చేకూరాలంటే నన్ను చూసేందుకు పవన్ రావాలి. ఆయన చేతుల మీదుగానే అంత్యక్రియలు నిర్వహించాలి’’ అని అనిల్ తన చివరి కోరికగా సూసైడ్ నోట్‌లో రాశాడు. పేద కుటుంబానికి చెందిన అనిల్‌కు భార్య, పిల్లలు ఉన్నారని సమాచారం. ఈ వార్త ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.