రాజ‌కీయాల‌కు, సినిమాల‌కు అతీతుడు ప‌వ‌న్‌!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగు భాష అంటే ఎనలేని అభిమాన‌మని మ‌రోమారు చాటుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు తెలుగు సాహిత్యంపై మంచి పట్టువుంద‌ని అంటుంటారు. దీనికితోడు  తెలుగు భాషను పరిరక్షించడానికి ప‌వ‌న్‌ ఎప్పుడూ ముందుంటారు. గతంలో తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణకు ఆయ‌న మ‌ద్ద‌తుప‌లికారు. గ‌తంలో ‘నిర్బంధ తమిళం’ అనే జీవో కారణంగా తమిళనాడులో ఇత‌ర‌ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్ప‌డింది. దీంతో అక్కడ తమిళనాడు తెలుగు యువశక్తి స‌భ్యులు నిరసన దీక్ష చేపట్టారు. రాజకీయాలను పక్కన పెట్టి  తెలుగు భాషపై ప్రేమతో ప‌వ‌న్ ఆ దీక్షకు మద్దతు ప‌లికారు. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల నుండి స్పదించిన నాయ‌కునిగా ప‌వ‌న్ నిలిచారు.
తెలుగు భాష పరిరక్షణపై ఆయనకు ఉన్న నిబద్ధతకు ఇదే నిద‌ర్శ‌నం. తాజాగా పవన్ త‌న జనసేన పార్టీకి సంబంధించిన సమాచార కార్యాలయానికి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులుగారి పేరు పెట్ట‌డం విశేషం. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహునిగా గిడుగు వెంకట రామమూర్తి పేరొందారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురునిగా  ఖ్యాతి గ‌డించారు. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకు వచ్చారు, గిడుగు చేప‌ట్టిన‌ ఉద్యమం కార‌ణంగానే విద్య వ్యావహారికభాషా రూపాన్ని సంత‌రించుకుని అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఫ‌లితంగా పండితులకే పరిమితమైన సాహిత్య ప‌రిభాష‌ ప్రతి ఒక్కరికీ సాధ్య‌మైంది. మ‌హ‌నీయుడు ‘గిడుగు’ను గుర్తు చేస్తూ జనసేన కొత్త కార్యాలయానికి ‘గిడుగు వెంకట రామమూర్తి ఇన్ఫర్మేషన్ సెల్’ అని నామకరణం చేయ‌డాన్ని భాషాప్రేమికులు మెచ్చుకుంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.