కేసీఆర్‌కు మేలు చేయనున్న పవన్ నిర్ణయం

ఎన్నికలు సమీపిస్తున్నందున జనసేన అధినేత స్పీడు పెంచాడు. ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జనసేన.. ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ప్రజలను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేస్తున్న ఆ పార్టీ అధినేత పవన్.. జనసేనను బలోపేతం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏపీలో ఇలా ఉండగా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి వ్యవస్థాగత నిర్మాణమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తుండడంతో ఆ పార్టీ ఎలా వ్యవహరించబోతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల కిందట పవన్ కల్యాణ్.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలనే అంశం మీద పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్‌)తో తమ పార్టీ కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మరోవైపు తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి సీపీఎం తహతహలాడుతోంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటికే రెండు దఫాలుగా జనసేన పొలిటికల్ ఎఫైర్‌తో చర్చలు జరిపారు. మొత్తంగా పవన్ వారితో జట్టుకట్టి బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌కు సారధ్యం వహిస్తూ తెలంగాణ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

కొందరు ఆశావహులు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేనను సంప్రదిస్తున్నారని, ఈ మేరకు మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. అలాగే పార్టీ కార్యాలయానికి వస్తున్న వారిలో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో వస్తున్నారని, అయితే.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వాళ్లను మాత్రమే జనసేనలో చేర్చుకుంటామని వారితో జనసేన నేతలు అంటున్నారని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన ఆసక్తి చూపుతున్న విషయం అర్థమవుతోంది. అయితే, ఒంటరిగా బరిలోకి దిగుతుందా..? లేక సీపీఎంతో కలిసి పోటీ చేస్తుందా..? అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. జనసేన తీసుకున్న ఈ నిర్ణయం కేసీఆర్‌కు మేలు చేయబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్-టీడీపీ-సీపీఐ పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. ఇప్పుడు పవన్ బరిలోకి దిగనుండడంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండుగా చీలుతుంది. దీంతో టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకలా మారుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.