పవన్ బస్ యాత్ర పేరు గ్రామ స్వరాజ్యం

ఏపీలో అధికారం చేజిక్కించుకునేందుకు రాజ‌కీయ పార్టీలు తెగ శ్ర‌మిస్తున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఇప్ప‌టికే  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ప్రాధాన్య‌త చూపిస్తున్నాడు. ఇక టీడీపీ కూడా తాము త‌క్కువేమి తిన్నామా అన్న‌ట్టు సైకిల్ యాత్ర‌ మొద‌లుపెట్టింది. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఎమ్మెల్యేలు సైకిల్‌యాత్ర పేరుతో ప‌ల్లెటూర్ల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇక ఇప్పుడు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 15 నుంచి ఏపీలో తన ‘రాజకీయ పర్యటనలు’ ప్రారంభించనున్నారు. ఈ బ‌స్ యాత్ర‌కు గ్రామ‌స్వ‌రాజ్యం అని పేరు పెట్టారు. ఈ పర్యటనల కోసం ఓ ప్రత్యేక బస్సు సిద్ధం అవుతోంది. బస్సు నుంచే నేరుగా ప్రజలనుద్దేశించి ప్రసంగించే ఏర్పాటు చేసుకోవటంతో పాటు…బస్సులో కొంత మంది ముఖ్యులతో సమావేశం అయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. తొలి దశలో పవన్ కళ్యాణ్ ఏకబిగిన 40 రోజుల పాటు పర్యటించే అవకాశం ఉందని సమాచారం. అవసరాన్ని బట్టి మధ్యలో ఒకట్రెండు రోజులు గ్యాప్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే తొలి దఫా టూర్ లో రాష్ట్రమంతటా కవర్ చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ అక్రమాలను ఎత్తిచూపటంతోపాటు… తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ నెల 11న బ‌స్సు యాత్ర తీరు తెన్నుల‌ను ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌నున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.