పవన్ కు జనం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దూకుడు ఇంకాస్త పెంచారు.  ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు గాలికి వదిలేశారని చెబుతున్నారు. నిన్నటి వరకు వ్యక్తిగత విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు పాలన పైనా బాణాలు ఎక్కు పెట్టారు. అసలు పాలనే లేదన్నారు. ఎంత సేపటికి మహానాడు పార్టీ ప్రచారానికే డబ్బులు ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో  పవన్ కు విపరీతంగా జనం వచ్చారు. వారిని చూసిన పవన్ లో ఉత్సాహం వచ్చింది. అంతే చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. 90 శాతం మంది గిరిజనులు ఉన్న కురుపాం నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకోలేదన్నారు పవన్. 
ముఖ్యమంత్రి తిరగడానికి మాత్రమే రోడ్డు వేసుకుంటున్నారు. పల్లె సీమలను పట్టించుకోవడం లేదన్నారు. మంచి నీరు వెళ్లలేని ప్రాంతాలకు సైతం కూల్‌డ్రింక్స్‌, మద్యం ఎలా వెళ్తోందని అడిగారు పవన్. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో కళింగ ఉద్యమం వస్తుందన్నారు. లోకేష్, చంద్రబాబులు అక్రమాలు చేస్తున్నారని..కేంద్రం మోసం చేసిందని దుయ్యబట్టారు. యాత్రను మూడు రోజులు ఆపిన తర్వాత తొలి రోజులు జనాలు పవన్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కోసం పెద్ద ఎత్తున జనం రావడం పార్టీ శ్రేణుల్లోను ఉత్సాహం నింపుతోంది. తనకు సెక్యూరిటీ కల్పించడం లేదని..కరెంట్ కట్ చేస్తున్నారని ఆరోపించిన పవన్ కు టీడీపీ ఘాటుగానే కౌంటరిచ్చింది. అయినా సరే పవన్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. అన్ని నియోజకవర్గాల్లో తిరిగి టీడీపీకి వ్యితిరేకంగా పావులు కదుపుతానని చెబుతున్నారట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.