బాబు మాటతీరుతో పార్టీకి నష్టం?

ఏపీకి ప్రత్యేకహోదా, బీజేపీ, కాంగ్రెస్, మైనారిటీలు ఇలా అన్ని అంశాలలోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట మార్చారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అలాగే ఏకకాలంలో దేశమంతా ఎన్నికలు, ఈవీఎంలు ఇలా అన్నింటిలోనూ చంద్రబాబు నాయుడు తీరు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉందని వారు అంటున్నారు. సందర్భానికి తగ్గట్టుగా, తన అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు మాటలు మార్చేస్తూ ఉన్నారని, ఇది పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ తీరుతో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడం మాటేమిటో కానీ చాలా చులకన అవుతోందని వారు తమ వాదన వినిపిస్తున్నారు. ప్రత్యేకహోదా కావాలి అని గత ఎన్నికల ముందు, ప్రత్యేక హోదా వద్దని బీజేపీతో జతకట్టినప్పుడు, ఇప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక మళ్లీ ప్రత్యేకహోదా నినాదం ఎత్తుకున్నారని వారంటున్నారు.
ఇక మైనారిటీల విషయంలో చంద్రబాబు నాయుడు అలానే వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు టికెట్లే ఇవ్వలేదు. ఒక్క పీలేరులో మాత్రం కిరణ్ తమ్ముడిని గెలిపించడానికి చంద్రబాబు బలహీన ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించారని వారు ఆరోపిస్తున్నారు. ఇక నాలుగున్నరేళ్లుగా మైనారిటీకి మంత్రి పదవిని ఇవ్వని చంద్రబాబు, తన తనయుడికి మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో చంద్రబాబు మైనారిటీకి మంత్రి పదవి అనడం శోచనీయంగా ఉందని రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విధమైన బాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని, దీనివలన పార్టీకి నష్టం జరుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.