ప‌ర‌కాల‌.. బీజేపీ వెనుకాల‌!

ఔనా! నిజ‌మేనా! అని ఆశ్చ‌ర్య ప‌డ‌కండీ.. అక్ష‌రాలా వాస్త‌వ‌మంటూ జోరుగా ప్ర‌చారం సాగుతుంది.నిన్న‌టి వ‌ర‌కూ ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారుగా వున్న‌ప‌ర‌కాల ప్ర‌భాక‌రుడు.. ఇప్పుడు మాజీ. బీజేపీతో టీడీపీ తెగ‌తెంపులు చేసుకున్నాక‌.. ప‌ర‌కాల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కాస్త చిన్న‌చూపు చూసింద‌ట‌. పైగా ప‌ర‌కాల స‌తీమ‌ణి నిర్మాలాసీతారామ‌న్ కేంద్రంలో కీల‌క‌మై ర‌క్ష‌ణ మంత్రిగా ఉన్నారు. దీంతో. అక్క‌డ తంపులాట‌.. ఇక్క‌డ కొలువులాట అని ఎందుకులే అంటూ. వారం రోజుల్లో ఎలాగూ ప‌ద‌వీకాలం ముగుస్తుంద‌న‌గా ప‌ద‌వికి రాజీనామా చేసి.. తన స‌చ్చీల‌త‌ను రుజువు చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. పోనీ..టీడీపీలో ఎంత‌మంది బ‌య‌ట‌కు పోలేదు అని టీడీపీ అనుకోవ‌ట్లేదు.
పైగా ప‌ర‌కాల నువ్వు మా వెనుకాలే ఉండాలంటూ మ‌రీ కోరార‌ట‌. ఇదంతా ఆయ‌న‌మీద ప్రేమ‌తో కాద‌ని.. టీడీపీలో తెర‌ముందు.. తెర‌చాటు వ్య‌వ‌హారాల‌న్నీ క‌ళ్లారా.. చెవులారా ఆయ‌న కూడా కీల‌క‌మైన వ్య‌క్తి. పైగా మీడియాతో స‌న్నిహిత సంబంధాలు.. ఇక కేంద్రంలోని బీజేపీతో విడ‌దీయ‌రాని బంధం ఉంది. అటువంటి నాయ‌కుడు బ‌య‌ట‌కు వెళితే ప‌ర్వాలేదు.. ఎక్క‌డ సైకిల్ గుట్టుమ‌ట్టు అవ‌త‌లి వారికి.. ముఖ్యంగా క‌మ‌లం శిబిరానికి మోసుకెళ‌తార‌నేది తెలుగు త‌మ్ముళ్ల ఆందోళ‌న‌ట‌.  క‌లిసొచ్చే కాలానికి న‌డిచొచ్చే నాయ‌కుడిగా ప‌ర‌కాల‌ను గుర్తించిన బీజేపీ.. ఇక రార‌మ్మ‌ని ఆహ్వానం ప‌లుకుతుంద‌ట‌. పైగా న‌ర్సాపురం ఎంపీ సీటు నీదేనంటూ మ‌రీ తాయిలం ప్ర‌క‌టించిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏదో ఒక‌రి నీడ‌లో కేబినెట్ హోదా అనుభ‌వించిన ప‌ర‌కాల‌కు ఇది బాగానే అనిపించింద‌ట‌. పైగా గ‌త ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం నుంచి బీజేపీ త‌ర‌పున గెలిచిన గో్క‌రాజు గంగ‌రాజు ఈ సారి పోటీకు సుముఖంగా లేర‌ట‌. సో.. కోరి వ‌చ్చిన అవ‌కాశాన్ని ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ కూడా ఆహ్వానించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అయితే.. టీడీపీ కూడా ప్ర‌భాక‌ర్‌కు మంచి ప‌ద‌వి ఇచ్చి మ‌ళ్లీ త‌మ‌వైపు ర‌మ్మ‌ని పిలుస్తుంద‌నే ఆశ‌తో… బీజేపీ ఇచ్చిన  ఎంపీసీటు ఆఫ‌ర్‌ను  అలా హోల్డ్‌లో ఉంచార‌ని తెలుస్తోంది.. చూడాలి ఏం నిర్ణయం తీసుకుంటారో మరి..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.