దూసుకుపోతున్న పవన్ కొడకా కోటేశ్వరావు… పాట

అజ్ఞాతవాసి చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడిన కొడకా కోటేశ్వరరావు పాట దూసుకుపోతోంది. యూట్యూబ్ లో ఆ పాట సంచనలం మైంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. రెండు రోజుల్లో అది నాలుగు మిలియన్లను దాటనుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది చిత్రంలో ‘కాటమరాయుడా కదిరీ న‌రసింహుడా’ అనే పాట‌ని ప‌వ‌న్ పాడి అభిమానుల‌ను అలరించారు. ఇప్పుడు అజ్ఞాత‌వాసి చిత్రం కోసం ‘కొడకా కోటేశ్వర రావు’ అనే పాటనుపాడి అలరించాడు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట రిలీజైన 24 గంటల్లో యూట్యూబ్ లో 2.78 మిలియన్ల వ్యూస్ ను దాటి.  2.27 లక్షల లైక్స్  వచ్చాయి. 
                           ఫలితంగా ప‌వ‌న్ పాట‌కు చాలా పాపులార్టీ వచ్చిందని అర్థమవుతోంది. జ‌న‌వ‌రి 10న ఈ సినిమా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న అజ్ఞాత‌వాసి కోసం తెలుగు రాష్ట్రాల‌లోని ఎక్కువ థియేట‌ర్స్‌ను బుక్ చేశారు నిర్మాతలు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ పవన్ కు జోడిగా నటించారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.