మళ్లీ తెరమీదకు పళ్లంరాజు…ఏం చేస్తారోమరి?

రాబోయే ఎన్నికల నేపధ్యంలో కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లంరాజు పేరు మ‌ళ్లీ వినిపిస్తోంది. దీంతో ఆయ‌న గురించి చ‌ర్చ ప్రారంభమైంది. తూర్పు గోదావ‌రి జిల్లా కేంద్రం కాకినాడ‌కు చెందిన మ‌ల్లిపూడి మంగ‌ప‌తి ప‌ళ్లం రాజు.. త‌న తండ్రి మ‌ల్లిపూడి శ్రీరామ సంజీవ‌రావు వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లో కాలుమోపారు. ఆయ‌న తండ్రి కాకినాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1971 నుంచి 1984 వ‌ర‌కు వ‌రుస‌గా మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం అందుకున్నారు. ఆయ‌న త‌న‌యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌ళ్లంరాజు ఉన్న‌త‌ విద్యాధికుడు. ఆయన ఇదే నియోజ‌కవ‌ర్గం నుంచి 1989లో ఒక‌సారి, 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గాను విజ‌యం అందుకున్నారు. 2004లో ప‌ళ్లంరాజు… ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో ముద్ర‌గ‌డ 57 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక 2009లో ముక్కోణ‌పు పోటీలో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన చ‌ల‌మ‌లశెట్టి సునీల్‌పై ఆయ‌న 34 వేల ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి కూడా లభించింది. అయితే, 2014 రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న రాజకీయాల్లో అంతగా కనిపించని పరిస్థితివుంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్‌ తరపున కాకినాడ‌లో పోటీ చేసి 19 వేల ఓట్ల‌తో స‌రిపెట్టుకున్నారు.
తాజాగా మ‌ళ్లీ ఆయ‌న పేరు తెర‌మీదికి వ‌చ్చింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ.. ప‌ళ్లంరాజు ను మ‌ళ్లీ తెర‌మీదికి తెచ్చారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాకినాడలో కాంగ్రెస్ ఒంట‌రిగావుంది. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు టీడీపీ బలం పుంజుకుంది. కొంద‌రు నేత‌లు వైసీపీలో చేరారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ యాక్టివ్ అవ్వాల‌ని భావిస్తున్న ప‌ళ్లంరాజుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌క‌త్వం కాకినాడలో, తూర్పు గోదావ‌రి జిల్లాలో పార్టీని పున‌ర్‌ నిర్మించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. కాగా కాకినాడ‌లో టీడీపీ, వైసీపీల‌కు బ‌ల‌మైన అభ్య‌ర్థులే ఉన్నారు. అయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని ప‌ళ్లంరాజు ఉవ్విళ్లూరు తున్నారట. అయితే, పార్టీకి కేడ‌ర్ లేక‌పోవ‌డం, ఉన్న‌వారిలో వ‌ర్గ పోరు వంటివి పెద్ద ఎత్తున ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయ‌న గెలుపు అంత ఈజీ కాద‌ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మ‌రి ప‌ళ్లంరాజు రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్తారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.