పాదయాత్ర ఫలితం ఎలా ఉంటుందో?

పాదయాత్ర అనగానే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన యాత్రే గుర్తుకువస్తుంది. తన పాదయాత్రతో 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న సర్కార్ ను దించేసిన ఘనత ఆయనకు దక్కింది. రైతులకు ఉచిత కరెంట్, పేదలకు ఉచితంగా పెద్ద ఆపరేషన్లు, ఆరోగ్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సౌకర్యం, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఫీజు రీ ఇంబర్స్ మెంట్ తదితర హామీలను వైస్ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడమే కాకుండా, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ పథకాలు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక చంద్రబాబు పాదయాత్ర కూడా ఆయనకు అధికారాన్ని అందించింది. కాగా ప్రస్తుతం ప్రజా సంకల్పయాత్ర పేరిట జరుగుతున్న జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సంకల్పయాత్రతో జగన్ రాజకీయంగా ఏ మేరకు మైలేజీ సాధించారు? జనంలో తన ప్రతిష్ఠను ఏమేరకు పెంచుకున్నారన్నది చర్చనీయాంశమైంది. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రిని హెలికాప్టర్ ప్రమాదంలో కోల్పోయిన తర్వాత  కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నుంచి వ్యతికేకత ఎదురుకావడంతో ఆ పార్టీకి దూరమై ప్రత్యేక పార్టీ పెట్టాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఓదార్పు యాత్రల పేరిట జనాలకు దగ్గరయ్యేందుకు విస్తృతంగా పర్యటించిన విషయం విదితమే. రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆవేదనతో కుమిలిపోతూ మరణించిన వారి  కుటుంబాలను జగన్ ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. ఈ సమయంలోనే జైలు జీవితం, మళ్లీ ఓదార్పు యాత్రలు, విభజన సమస్యల నేపథ్యంలో సమైక్యఆంధ్ర ఉద్యమం, విభజన తర్వాత ఎన్నికల్లో ఓటమి, తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమం ఇలా అన్నింటా జగన్ తనదైన ప్రత్యేక ముద్ర వేశాడంటుంటారు. ఇప్పుడు సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ విధంగాదాదాపు పదేళ్లుగా ప్రజలతో మమైకం అవుతూ తనదైన శైలిలో జగన్ పోరు సాగిస్తున్నారు. ప్రజలకు  తిరిగి రాజన్న పాలన అందించాలన్న సంకల్పమే తనను ముందుకు నడుపుతోందని ఆయన చెబుతున్నారు. ఈ పదేళ్లలో తన కుటుంబాన్ని కూడా జగన్ అంతగా పట్టించుకోలేదంటుంటారు. ప్రజలకోసం పోరు సాగిస్తున్నారు. అవినీతి పాలనపై తనదైన శైలిలో యుద్ధం చేస్తున్నారు. అయితే జగన్ కృషిని జనం గుర్తిస్తారా? గుర్తించి వైఎస్ ఆర్ పార్టీని అక్కున చేర్చుకుంటారా? అనేది కాలమే చెప్పాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.