ఏపీలో బీజేపీకి మిగిలేది ఆ ఒక్కడేనట

విభజన హామీలు అమలు విషయంలో మోసం చేసిందనే కారణంతో అక్కడి ప్రజల దృష్టిలో బీజేపీ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. నిధుల కేటాయింపు విషయంలో కూడా కేంద్రంపై అక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారు. టీడీపీ-బీజేపీతో కలిసున్నంత కాలం ఆ పార్టీపై మంచి అభిప్రాయంతో ఉన్న ఏపీ జనాలు.. ఎప్పుడైతే ఆ పార్టీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. తమ పార్టీ నేతలతో ఏపీ ప్రభుత్వం ఎదురుదాడి చేయించాలని డిసైడ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బలు తగలబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పైడికొండల మాణిక్యాలరావు, కృష్ణా జిల్లా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆకుల సత్యనారాయణలు బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. వీరిలో మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులకు చంద్రబాబు తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అయితే, టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన సమయంలో వీరిరువురూ తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగారు. ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓ వార్త బీజేపీని భయపెడుతుందట.

ఈ నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు మూడు పార్టీల్లోకి జంప్ అవబోతున్నారని సమాచారం. ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరికకు సిద్ధం అవుతున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. వీటిని ఆయన ఖండించకపోవడం, ఆయన సతీమణి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తుండడం వంటి కారణాలతో ఆయన చేరిక దాదాపు ఖాయమైనట్లే. మరో ఎమ్మెల్యే కామినేని ఎప్పటి నుంచో టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. విష్ణుకుమార్ రాజు వైసీపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ నేతలతో మంతనాలు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. మాణిక్యాలరావు మాత్రం బీజేపీలోనే కొనసాగనున్నారని సమాచారం. ఆయనకు ఆరెస్సెస్ బ్యాగ్రౌండ్ ఉండటం వల్లే బీజేపీ అంటే ఇష్టపడతారు. అందుకే ఆయన ఏ వైపూ చూడట్లేదని టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.