ఓరుగల్లు కోట జిల్లాలో టిక్కెట్ల గోల

తెలంగాణ సిఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు పై నివేదికలు తెప్పించుకున్నారు. పాత జిల్లాల వారీగా వచ్చిన నివేదికలను ఇప్పుడు పూర్తిగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల్లో మార్పులు చేర్పులు చేస్తారట. వచ్చే ఎన్నికల్లో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు లేవని నివేదిక వచ్చిందట. అందుకే వారికి ఎసరు పెట్టే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ కు వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు పనితీరు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మందికి టిక్కెట్ రాదనే ఆందోళన పట్టుకుంది. మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు టిక్కెట్ ఇచ్చేది అనుమానమే. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కవితకు టిక్కెట్ ఇచ్చే అవకాశముందని సమాచారం. 
గులాబీ నేత గెలుపుకు కాంగ్రెస్ పార్టీ గండి పెట్టనుందని నివేదిక వచ్చిందట. ఆ తర్వాత ములుగు ఎమ్మెల్యే, మంత్రి అజ్మీరా చందూలాల్ పనితీరుపై వ్యతిరేకత వచ్చింది. ఈసారి ఆయన గెలిచే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే సీతక్కకు అక్కడ  గెలిచే చాన్స్ ఉంటుందంటున్నారు. అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లిలో ఆయన మీద అంత పాజిటివ్ లేదు. ప్రజలకు పెద్దగా ఆయన అందుబాటులో ఉండటంలేదు. పైగా ఏది అడిగినా సరిగా చేయలేకపోతున్నారనే ప్రచారముంది. ఆసీటు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్దపడటంలేదనే లీక్ లు వస్తున్నాయి.
ఇక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిఎం కేసీఆర్ కు చికాకు తెప్పిస్తున్నారు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రిజర్వేషన్లే వద్దని చెబుతున్నారు. ఫలితంగా రిజర్వేషన్లు ఉన్న ప్రజలు ఆయన్ను వ్యతిరేకించే వీలుంది. అక్కడ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బరిలోకి దిగనున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈసారి గెలవడం అంత తేలిక కాదు. అసలు కేసీఆర్ టికెట్ ఇచ్చినా గెలవలేడని ఆపార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. టాలీవుడ్ హీరోయిన్ తో ఆయన దొరికాడనే వాదన లేకపోలేదు. అంతే కాదు… బాగా మందు కొట్టి కేసీఆర్ పై నోరు జారాడని అందుకే పదవితో పాటు.. ఆయన టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు ఆయన స్థానంలో రాజారపు ప్రతాప్ కు టికెట్ ఇస్తారని తెలుస్తోంది. అయినా సరే ఇక్కడ గులాబీ గెలుపు చాలా కష్టమంటున్నారు. మరోవైపు ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత విజయరామారావు పోటీ చేయనుండటం వల్ల టీఆర్ఎస్ కు చుక్కలు కనపడతాయంటున్నారు. 
ఇక కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ భాస్కర్ ల పనితీరు బాగానే ఉన్నా… వారికి అక్కడే సీట్లు ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పరకాలలో ధర్మారెడ్డిపై ఓడిపోయిన సహోదర రెడ్డికి టిక్కెట్ ఇస్తారా లేక కొండా సురేఖను అక్కడకు పంపుతారా అనేది తేలలేదు. మొత్తంగా ఓరుగల్లు రాజకీయం రసవత్తరంగా మారింది.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.