టీడీపీ పై విపక్షాల మాటల దాడి 

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాడు. తొలిసారిగా బెజవాడలో పాదయాత్ర చేశాడు. సిపిఎం, సిపిఐ నేతలతో కలిసి ఆయన ఈ యాత్రలో పాల్గొనడం విశేషం. టీడీపీని నమ్మలేం. అందుకే తాను కమ్యూనిస్టులతో కలిసి పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం ఆశ్చర్యం. హోదా కోసం తాను పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. అదే చేస్తున్నారు. అయినా పవన్ కల్యాణ్ కు నమ్మకం కుదరడం లేదట. అందుకే చంద్రబాబు తన వైఖరిని చెప్పాలంటున్నారు. చంద్రబాబు గతంలో ప్రత్యేక హోదా సంజీవని అన్నారని.. ఇప్పుడేమో హోదాయే కావాలంటున్నారని ఆయన అన్నారు. అసలు ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పడం లేదన్నారు. కొందరి వ్యక్తిగత హోదాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని పవన్ మండిపడ్డారు. కొన్ని ఒత్తిళ్ల వల్ల టీడీపీ, వైకాపాలు హోదాపై పోరాటం చేయలేకపోయాయని చెప్పారు పవన్. 
తన మంత్రుల ద్వారా చంద్రబాబు అభిప్రాయం చెప్పాలని కోరడం ఆశ్చర్యం. అఖిలపక్షం అంటూ ఇప్పుడు చేస్తున్న హడావుడి రెండేళ్ల క్రితమే చేసుంటే ఫలితం ఉండేదనేది పవన్ మాటగా ఉంది. హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్ ఇప్పుడు ఆ పని చేయలేదు. హోదా కోసం జాతీయ నేతలను కలుస్తానన్న పవన్ ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాడు. అదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు అది చేయలేదు. ఇది చేయలేదని చెబుతున్నాడు. చెప్పే ముందు తాను ఏం చేశాను అనే సంగతి గుర్తుంచుకోవాలి. కానీ పవన్ అది మర్చిపోయినట్లున్నారు.  
బాబుకు జగన్ సవాల్…
తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాక జగన్ పార్టీలో ఉత్సాహం నెలకుంది. అందుకే టీడీపీకి జగన్ సవాల్ విసిరారు. ఆంద్రప్రదేశ్ ప్రజలతో కలిసి నడవాలన్న ఉద్దేశం ఉంటే టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామాలు చేయించాలని కోరారు. మేం చెప్పిందే చేశాం. మా ఎంపీలు రాజీనామాలు చేశారు. చంద్రబాబుకు నేను సవాల్‌ విసురుతున్నా. మీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించండని కోరారు. తమ ఎంపీలతో రాజీనామాలు చేయించాడు కాబట్టి సవాల్ విసిరారు జగన్. 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.