ఓ అభిమాని రాసిన ఆవేదన, ఆత్మఘోష లేఖ:

ప్రేతాత్మలు కలిసికట్టుగా బయలు దేరాయి… ఆత్మలు క్షోభిస్తున్నాయంటూ…. తిరుగాడుతున్నాయి..

చంద్రబాబు రాహుల్ గాంధీని కలిసినందుకు.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందంట… ! ఆ ఆత్మ వచ్చి.. ఈ ప్రేతాత్మలతో చెప్పిందంట..! చంద్రబాబు రాహుల్ గాంధీని కలవడంతో .. గత్తర బిత్తర గాళ్లందరూ.. తత్తర పడుతున్నారు.

సరే…. ఎన్టీఆర్ తోనే మొదలుపెడతాం…
1991లో అనుకుంటా… నంద్యాల ఉపఎన్నికల్లో పీవీనరసింహారావు బరిలో నిలిచినప్పుడు… పోటీ లేకుండా చేసింది ఎవరో తెలుసా.. ? ఆ పీవీ నరసింహారావుది ఏ పార్టీనో ఐడియా ఉందా..? ప్రధాని కాబట్టి…. పోటీ లేకుండా వదిలేశాం… అంటారు.. కానీ.. లెక్క ప్రకారం మాట్లాడితే.. అది కాంగ్రెస్ తో పొత్తు అవునా…? కాదా…? ఎన్టీఆరే ఒక మార్గం చూపినప్పుడు… అవసరం కోసం ఆ మార్గాన్ని అనుసరిస్తే… తప్పొచ్చిందా.. ?

అయినా ఎన్టీఆర్ తిరగబడింది.. కాంగ్రెస్ మీద కాదురా.. ఢిల్లీ అహంకారం మీద…! ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది కూడా అదే… ఢిల్లీ అహంకారంపైన తిరుగుబాటు..!!రాహుల్ గాంధీ.. చంద్రబాబు జస్ట్ కలిశారంతే.. వాళ్లిద్దరూ కలిస్తే.. మీకు కడుపొచ్చినట్లు అరుస్తున్నారెందుకు…? ఒకవేళ ఏమైనా ఇబ్బందుంటే… ఆ రెండు పార్టీలలో కార్యకర్తలకు ఇబ్బంది ఉండాలి. మధ్యలో మీ ఆర్తనాదాలేంటి..?

ఆత్మలు గురించి.. తెగ ఆరాటపుడున్న… ఈ ప్రేతాలన్నీ…
ఎన్టీఆర్ కు స్వయానా కూతురైన పురంధేశ్వరి… కాంగ్రెస్ లో మంత్రి అయినప్పుడు…
ఎన్టీఆర్ కు అల్లుడైన దగ్గుబాటి అక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు….
ఎన్టీఆర్ కు భార్యగా ఉన్న లక్ష్మీపార్వతి.. పిల్లకాంగ్రెస్ పంచన చేరినప్పుడు…
ఆత్మలను ఏ అంగళ్లలో తాకట్టు పెట్టాయి.

చంద్రబాబు పచ్చి అవకాశవాది…
మరి మన మహానేతలు.. యువమేతలు.. జాతిపితలు ఆదర్శవాదులా… ? వారి చరిత్ర తెలీనది ఎవరికి….. ?సొంత పార్టీలో సీఎంలపై చెప్పులు వేయించి.. పార్టీ నేతలను ఓడించి.. తనకు కావలసిన వాళ్లని ఎదుటి పార్టీల్లోకి పంపి సొంత పార్టీకే ద్రోహం చేసినప్పుడు… టీఆరెఎస్ ను చీల్చి.. వాళ్ల కొంపలోనే రెండో కుంపటి రాజేసినప్పుడు…. మీ ఆత్మలు చప్పుడు చేయలేదేందుకు…?

సోనియాతో సై అని కడపలో తొడగొట్టి.. ఢిల్లీ గడపలో.. కేసుల కోసం.. బొక్క బోర్లా పడుకున్నప్పుడు … తన అధికారం కోసం.. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం చేసుకున్నప్పుడు…తాను గెలిస్తే… ఎంపీల మద్దతిస్తా అని జైలు నుంచి బయటకొచ్చినప్పుడు… ఆనక… ఇప్పుడు బీజేపీతో అంటకాగుతున్నప్పుడు… మీ ఆత్మలు ముసుగుతన్ని పడుకున్నాయెందుకు…?

2004 లో కాంగ్రెస్ తో కులికి.. 2009లో టీడీపీతో కలిసి… 2014కు ముందు సోనియాను దేవత అని… ఇంటిల్లపాది.. ఇంటికెళ్లి దండం పెట్టి.. నెలతిరక్కుండానే… దెయ్యం అన్నప్పుడు… ఏడాది కిందట మోడీగాడు.. అని పెడసరంగా మాట్లాడి.. ఇప్పుడు ఆ మోడీనే మా గాడ్.. గాడ్ ఫాదరంటూ.. మోడీ మోచేతి నీళ్లు తాగుతున్నప్పుడు .. ఏ ఆత్మ ఘోషించలేదెందుకు..?

ప్రతోడు చంద్రబాబు స్టాండ్ మార్చాడు.. వాళ్లతో కలిశాడు.. వీళ్లతో కలిశాడు అంటారు..
మరి చంద్రబాబు స్టాండ్ మారిస్తే.. ఆయనతో కలిసినోళ్లు కూడా మార్చినట్లేగా.. 2004లో కాంగ్రెస్ తో ఉన్న టీఆరెఎస్ 2009లో టీడీపీతో ఎందుకు కలిసింది..? మోడీని అరెస్ట్ చేయిస్తానన్న చంద్రబాబుతో.. బీజేపీ ఎందుకు కలిసింది…? నాలుగు ఎంపీ సీట్లు అడుక్కుంటే.. కేంద్రంలో అధికారంలోకి రావొచ్చనే కదా..! కన్నూ.. మిన్నూ కానరాకుండా.. మాట్లాడే “కన్నా” కు ఇది తెలీదా.?. ఇప్పుడు చంద్రబాబు అడుక్కున్నాడా.. కాంగ్రెస్ ను కలవమని…? పెద్ద పార్టీలు చిన్న పార్టీలను కలవమని అడుగుతాయి.. చంద్రబాబు వెళ్లి రాహుల్ ని అడిగితే.. కాంగ్రెస్ కంటే.. టీడీపీ పెద్దదని ఒప్పుకుంటారా మరి…అసలు టీడీపీని .. ఆంధ్రను వ్యతిరేకించే.. తెరాస గాళ్లు కూడా దీనిమీద మాట్లాడేవాళ్లే… ! ఎన్టీఆర్ ఆత్మ క్షోభించి.. పార్టీకి తేడా జరిగితే.. టీడీపీ మునిగిద్ది.. మరి మీకెందుకురా.. కింద తడుస్తోంది…. ?జగన్ పారేసే చిల్లర ఏరుకునే… పావలా ఆర్టికల్ గాళ్లు.. లత్కోరు ముచ్టట్లు చెప్పే వెబ్ సెట్లు ఎందుకు యాగీ చేస్తున్నారు..లెక్కలు తీస్తే.. బొక్కలు చాలా బయటకొస్తాయి..

అప్పటి దాంకా.. మీ ఆత్మలను ఎక్కడన్నా పెట్టుకోండి..

1 Comment

  1. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ కాంగ్రెస్ తో కూటమి కడితే మీకు సిగ్గుండాలి అని అడిగే పవన్ లాంటివారు 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు కాంగ్రెస్ వాళ్లను పంచెలూడ గొట్టి తరుముతాం అని ప్రగల్భాలు పలికి అదే కాంగ్రెస్ పార్టీలో తమ స్వాంతలాభం కోసం అమ్ముడుపోయి ప్రజారాజ్యం పార్టీని కలిపేసినపుడు వీరికి సిగ్గు షరం రాలేదా ? అధికారంలోకి వస్తూనే ప్రత్యేక హోదాపై తొలిసంతకo అన్నవారితో కాకుండ ప్రత్యేకహోదా ఇవ్వక ,విభజన హామీలు ఇవ్వక,ప్రత్యేక ప్యాకేజి ఇవ్వక,లోటుబడ్జెట్, రాజధాని తదితర నిధులివ్వక సైతాన్లలా సతాయిస్తున్న వారితో,మనరాష్ట్రo పై కుట్రలుచేస్తున్న పక్క రాష్ట్రంలోని పార్టీకి వీళ్ళలా తొత్తులుగా మారాలా? బురద అంటించుకున్న వారే ఎదుటివారిలో లేని బురద చూపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.