కొద్ది నెలల కిందట తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంక్ దక్కింది. అంతే ఊరు వాడా అంతా అదిరిపోయేలా సంబరాలు చేయించారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత అమెరికా అధ్యక్షురాలు కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు తాము వ్యాపార, వాణిజ్య రంగాల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉన్నామని ఘనంగా ప్రకటించారు. కానీ ఆ సభకు కనీసం చంద్రబాబును ఆహ్వానించలేదు సి.ఎం కేసీఆర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ర్యాంకులలో ఏపీకి పదో స్థానం ఉండేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు తెలంగాణకు 9వ స్థానం దక్కితే ఏపీకి నెంబర్ వన్ స్థానం దక్కింది. వ్యాపార సరళీకరణ ర్యాంకులను ప్రకటించడంతో ఇప్పుడు అంతటా అదే అంశంపై చర్చ జరుగుతోంది.
నాడు ఏపీకి పదో స్థానం దక్కడంతో సిఎం చంద్రబాబుతో పాటు.. ఐటీ మంత్రి నారా లోకేష్ లు పలు దేశాలను పర్యటించారు. అమెరికాతో పాటు.. దావోస్ తదితర ప్రాంతాలకు వెళ్లారు నేతలు. పెట్టుబడుల కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పలు శాఖలకు చెందిన వివరాలు ఉంటాయి. ఆయా శాఖలను పరిశీలించి ఈ ర్యాంకులను కేటాయిస్తారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్రం లేదా ప్రపంచ బ్యాంక్ ఎవరు కోరుకుంటే వారికి ఇవ్వాలి. ప్రతి ఏటా ఇలానే సంబంధిత శాఖలకు వివరాలు అందిస్తారు. గతంలో ఏపీ అధికారులు వాటి వివరాలను ఇవ్వలేదు. ఫలితంగా ఏపీ ర్యాంక్ పడిపోయింది. ఈ సారి ఊరుకోలేదు. ఏపికి వచ్చిన పెట్టుబడులు, జరిగిన వ్యాపారం, అడుగు పెట్టిన సంస్థలు. ఇంకా వస్తున్న కంపెనీల వివరాలను వారికి అందించారు. ఫలితంగా ఏపీకి దేశంలోనే నెంబర్ వన్ స్థానం దక్కింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ప్రపంచంలోని అన్ని దేశాలకు ర్యాంకులను కేటాయించే పద్దతి ఎప్పటి నుంచో అమలు చేస్తోంది ప్రపంచ బ్యాంకు. దాని అంచనాల ప్రకారం ఇండియాలోని 29 రాష్ట్రాలలో ఏపీ టాప్ ప్లేస్ వచ్చేసింది. గుజరాత్, కర్నాటక రాష్ట్రాల వ్యాపారాలను తలదన్నేలా ఏపీ ఎదుగుతోంది. అదే సమయంలో ఫిబ్రవరి 24 నుంచి 26వరకు విశాఖలో ఏపీ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరగనుంది. అందుకోసమే ఇటీవల సి.ఎం చంద్రబాబునాయుడు ఒక్క రోజు పర్యటన కోసం యుఏఈకి వెళ్లి వచ్చారు. అక్కడ జరిగిన సదస్సులోను మాట్లాడారు. ఈ సదస్సుకు వేలాదిగా పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ విచ్చేయనున్నారు. కీలక సమయంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను ప్రకటించడం ఏపీకి వరంగా మారనుంది. పెట్టుబడులు మరింత పెరిగేందుకు ఇది దోహదం చేయనుంది.
దేశంలో దాదాపు ఆరేడు రాష్ట్రాలు రైతులకు పంటలకు ఆర్థిక సాయం అందజేస్తుంటే… అందులో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం శుభ శకునమే. దేశానికి వెన్నెముక అని రైతును పొగడటమే కాని గతంలో రైతుకు ప్రభుత్వాలు పెద్దగా అండగా నిలబడలేదు. చంద్రబాబు హయాంలో మొదటి సారిగా 20 ఏళ్ల క్రితం […]
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఏపీలో ముందస్తు లేకున్నా అక్కడ కూడా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న పనులకు ఎన్నికలు వచ్చేస్తున్నాయా..? అనే సందేహం కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధే ఆయుధంగా బరిలోకి దిగాలని భావిస్తుండగా, మిగతా పార్టీలు ప్రభుత్వ […]
కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్న టీడీపీ బహీష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు గుండెపోటు వచ్చింది. గతంలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) తరపున పోటీ చేస్తున్న ఆయనకు శుక్రవారం తెల్లవారుజామున […]
Be the first to comment