
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. వారాహీ చలన చిత్ర సమర్పణలో సాయి కొర్రపాటి, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. సినిమాలపై ఆసక్తి కలిగి, నటించాలనుకునే వాళ్లకు ఈ చిత్ర యూనిట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆహ్వాన పత్రాన్ని విడుదల చేశారు.
ఇందులో ‘‘నటిస్తూ, తెర మీద కనిపించాలనుకునే వాళ్లు చాలా మంది ఉండుంటారు. కానీ, మంచి అవకాశాలు రాని వాళ్లు కొందరు.. ఏది మంచి అవకాశమో అర్థం కాని వాళ్లు కొందరు.. అలాంటి వాళ్లందరికీ ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము. ఎన్బీకే ఫిల్మ్స్ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ నటిస్తూ… క్రిష్ జాగర్లమూడి ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ప్రాముఖ్యత గల కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నాం. ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారు రెండు ఫొటోలు, సెల్ ఫోన్ నెంబర్‌తో పాటు వాళ్ల ఫెరఫార్మెర్స్ని షూట్ చేసి రెండు వీడియోలు (30 సెకండ్స్) తీసి casting.ntrbiopic@gmail.com ఈ మెయిల్ పంపాల’’ని కోరారు.
అంతేకాదు దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరూ ఆఫీస్‌కి రావొద్దని సూచించారు. మెయిల్ ద్వారానే సమాచారం పంపాలని తెలిపారు. తాము అనుకున్నట్టు అనిపించిన వాళ్లను ఆడిషన్స్‌కు ఆహ్వానిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
Be the first to comment