కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన ఎన్టీఆర్ కుటుంబం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సోమవారం జరిగింది. ఈరోజును పురష్కరించుకుని టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. మరో పక్క ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీఆర్ జయంతిని పండుగల జరుపుకుంటుంటారు. ఎన్టీఆర్ జయంతి రోజునో, వర్ధంతి రోజునో టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు.

అయితే ఈసారి మాత్రం ఆయన కుటుంబ సభ్యులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు ఆయన కుటుంబ సభ్యులు. ముందుగా నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, కుటుంబ సభ్యులతో కలసి ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని, పూల మాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత నారా భువనేశ్వరి, బ్రహ్మణీ, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, పురందేశ్వరి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.

అయితే, వారంతా ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరిస్తూ.. అన్న నందమూరి తారక రామారావు జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలను పాఠ్యా పుస్తకాల్లో చేర్చాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. అలాగే పురందేశ్వరి ఒక్క అడుగు ముందుకేసి.. కృష్ణా జిల్లా పేరును ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు.

డిమాండ్ చేయడం వరకు బాగానే ఉంది కానీ, ఈ విషయాన్ని జగన్ ఎప్పడో ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ‘‘నేను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా’’ అని హామీ ఇచ్చారు. అంటే.. జగన్, బీజేపీ నేత అయిన పురందేశ్వరి ఒకటే విషయాన్ని ప్రస్తావించడం వెనుక చాలా కథ దాగుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.