‘ఎన్టీఆర్‌’కు హీరోయిన్ దొరికేసిందా..?

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలయ్య ఇటీవల అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాకు దర్శకుడినైతే ప్రకటించారు కానీ, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం ప్రకటించలేదు. అయితే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ పేరును త్వరలో ప్రకటించనున్నారట. ఆమె ఎవరంటే.. ‘మహానటి’లో అద్భుత నటనతో ప్రశంసలందుకుంటున్న కీర్తి సురేష్‌. ఇటీవల చిత్ర బృందం.. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరిపారని, దీనికి కీర్తి ఓకే చెప్పేసిందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇది నిజమో కాదో తెలియక ముందే.. మహానటిగా తెలుగు వారిని ఫిదా చేసిన కీర్తి సురేష్.. బసవతారకం గారి పాత్ర చేయాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారట..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.