ప్రవాస భారతీయులు న్యూ ఇండియా కార్యక్రమం 

నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటై నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ప్రవాస భారతీయులు న్యూ ఇండియా కార్యక్రమం  :

వాషింగ్టన్ డీసీ : శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటై నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ప్రవాస భారతీయులు న్యూ ఇండియా అనే  కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ రామ్ మాధవ్ గారు మరియు పార్లమెంట్ సభ్యులు, మరియు బీజేపీ జాతీయ ప్రవక్త శ్రీ జి.వి. ఎల్ నరసింహ రావు గారు ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగింది. 
ఈ సందర్బంగా  అఫ్ బీజేపీ అధ్యక్షులు, శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు మాట్లాడుతూ, శక్తివంతమైన నాయకులు తీసుకొన్న నిర్ణయాలు దేశ భవిషత్తు తరాలకు ఎంతో మేలు చేకూరేవిగా ఉంటాయి. అలంటి శక్తివంతమైన నాయకుల్లో మోదీ గారు ఒకరు అని తెలిపారు. మోదీ గారు తీసుకొన్న అనేక నిర్ణయాలు భవిషత్తు తరాలకు ఎంతో మేలు కల్గించే విదంగా ఉన్నాయి అని తెలిపారు. 
తరువాత , అఫ్ బీజేపీ ఉప -అధ్యక్షులు శ్రీ అడపా ప్రసాద్ గారు, ఈ కార్యక్రం విజయవంతం కావడంలో ప్రముఖ పాత్ర వహించిన అనేక సంఘాల నాయకులకు మరియు కార్యకర్తలకు దన్యవాదాలు తెలపడం జరిగింది. 
శ్రీ జి.వి. ఎల్  గారు మాట్లాడుతూ , మోదీ గారి అద్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధ్ది కార్యక్రమాలను మరియు వాటి ఫలితాలను క్షున్నంగా వివరించడం జరిగింది. అదేవిదంగా, ప్రవాస భారతీయులు అందరు కలిసి మెలిసి ఉంటూ, దేశ అభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించాల్సిందిగ కోరారు. 
శ్రీ నరేంద్ర మోడీ  గారి అద్వర్యంలో, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అనేక అభివృద్ధి పనులను గురించి చాల క్లుప్తంగా వివరించడం జరిగింది. ముక్యంగా ఎందుకు స్పెషల్ ప్యాకేజి మరియు స్పెషల్ స్టేటాస్లో  ఉన్న తేడా , మరియు ఎందుకు స్పెషల్ ప్యాకేజి రాష్ట్రానికి చాల విలువైందో చాల క్లుప్తంగా వివరించారు.  
 శ్రీ రామ్ మాధవ్ గారు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి మూలా స్తంభాల గుంరించి వివరించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ, భారత దేశం యొక్క ఏకీకరణ, సగటు భారతీయునికి సమాజంలో గౌరవం, దేశ భద్రతా, సమతుల్య ఆర్థిక అభివృద్ధి, మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానానికి  మూలా స్తంబాలుగ పేర్కొన్నారు. 
ఈ సంబరాల్లో ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, అఫ్ బీజేపీ ఉప -అధ్యక్షులు శ్రీ అడపా ప్రసాద్ గారు, ఓఎఫ్ బిజెపీ వాషింగ్టన్ డీసీ కోఆర్డినేటర్ శ్రీ లక్ష్మి నారాయణ గారు, ఓఎఫ్ బిజెపీ ఒహయోకోఆర్డినేటర్ శ్రీ  శ్రీనివాస్ కొంపల్లి గారు,  ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్ శ్రీ సమీర్ చంద్ర గారు,  ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల గారు, శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు మరియు ఇతర ఓఎఫ్ బిజెపీ నేతలు,  శ్రీ వంశీ యంజాల గార్లుతో  పటు అనేక సంఘాల నేతలు  మరియు అనేక మంది ప్రవాస భారతీయులు  ఉత్సహంగా పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.