అమెరికాలో పెరుగుతున్న మ‌నోళ్ల ఆధిప‌త్యం

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌నోళ్ల సంఖ్య పెరుగుతోంది. ఏటికేడాది అక్క‌డ మ‌నోళ్లు పెద్ద ఎత్తున్నే పౌర‌స‌త్వాలు ద‌క్కించుకుంటున్నారు. తాజాగా వెలువ‌డిన గ‌ణాంకాలు దీన్ని నిజం చేస్తున్నారు. గత ఏడాది అగ్రరాజ్యం అమెరికాలో సుమారు 50 వేల మంది భారతీయులు పౌరసత్వాన్ని పొందారు. ఇది 2016 కన్నా నాలుగు వేలు ఎక్కువ అని రికార్డులు స్పష్టం చేస్తుండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. ఓవైపు ట్రంప్ ఆంక్ష‌ల క‌త్తి వేలాడుతూ అమెరికా అంటే భ‌యం పుట్టిస్తున్న‌ప్ప‌టికీ…మ‌రోవైపు మ‌నోళ్ల‌కు వీసాలు భారీ స్థాయిలో పెర‌గ‌డం ఆస‌క్తిక‌రంగా మారుతోంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ వెల్లడించిన తన వార్షిక నివేదిక ప్ర‌కారం గత ఏడాది 50 వేల 802 మంది భారతీయులకు పౌరసత్వం ఇచ్చారు.  2016లో మొత్తం 46 వేల 188 మందికి పౌరసత్వం దక్కింది. 2015లో ఆ సంఖ్య 42 వేల 213గా ఉంది. అయితే గత ఏడాది అమెరికా పౌరసత్వం తీసుకున్న విదేశీయుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. అత్యధికంగా సిటిజన్‌షిప్ తీసుకున్నవారిలో మెక్సికన్లు ఉన్నారు. రెండవ స్థానంలో ఇండియా, మూడవ స్థానంలో చైనా ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో పిలిప్పీన్స్, డామినికన్ రిపబ్లిక్, క్యూబా దేశాలు ఉన్నాయి. భారత్ నుంచి పౌరసత్వం పొందిన వారిలో సుమారు 12 వేల మంది కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. న్యూజెర్సీలో 5900, టెక్సాస్‌లో 3700 మంది భారతీయులు సెటిలయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.