ఏపీకి హోదా రాదట

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదన్నారు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ. మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి తదితర మేధావులతో జేపీ సమావేశమయ్యారు. అవసరమైతే కేంద్రానికి తాము సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వారు సిద్దమయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. 
ఆసక్తి చూపని పనన్ కల్యాణ్…
జేఎఫ్‌సీపై పవన్‌ మొదట చూపించిన శ్రద్ధ ఆ తర్వాత చూపించడం లేదు. నిలకడ లేమి ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు చెప్పిన మాట ఆ తర్వాత ఆచరణ రూపం తేవడం లేదు. హోదా పోరు చేస్తానంటాడు. చేయలేడు. ఆమరణ దీక్ష అంటాడు. ఆ పని చేయడం లేదు. మొన్నటి వరకు అంటకాగిన పార్టీలను నేడు బద్ద శత్రువులుగా చూస్తున్నారు. మొత్తంగా పవన్ నిరాశలో కూరుకుపోయాడనే వాదన సాగుతోంది. జేఎఫ్‌సీ పక్షాన స్వతంత్రం నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. విషయం ఏదైనా రాష్ట్రానికి నిధులన్నీ రావాలి. వెనుకబడిన 7 జిల్లాలకు రాయితీలు ఇవ్వాలి. ప్రధాని సమయం ఇస్తే కలిసి అన్ని వివరించేందుకు సిద్దమని చెప్పారు ఆ కమిటీ సభ్యులు. మాకు పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ అయినా ఒకటే. ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పారు జేపీ. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిచ్చిన విభజన హామీలపై స్వతంత్ర నిపుణుల బృందం వాడి వేడిగా చర్చించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చట్టపరంగానూ, పార్లమెంట్లోనూ ఇచ్చిన హామీల్ని నేరవేర్చాలని వారు తీర్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ వివాద పరిష్కారానికి తోడ్పాటునందించే పౌరసమాజంగా ఏర్పడనుంది ఈ కమిటీ.
హోదా కోసం టీడీపీ, వైకాపా, కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. వారే కాదు.. సినీ ప్రముఖులు తమ వంతు మద్దతు పలికారు. మొత్తంగా కేంద్రం ఏపీకి న్యాయం చేసే విషయంలో చాలా రకాలైన కొర్రీలు వేస్తోంది. అందుకే హోదా అసలు ఏపీకి రాదంటున్నారు జేపీ. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.