క్లీన్‌స్వీప్ చేసిన చోట ఏడుగురికి నో టికెట్

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలన్నీ వేగం పెంచేశాయి. అధికార పక్షం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోవాలని చూస్తున్నాయి. అందుకే అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధానంగా పోటీ జరగగా, ఇప్పుడు జనసేన ఎంట్రీతో త్రికోణ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పోటీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఇదిలాఉండగా, అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో నిలబెట్టబోయే అభ్యర్థుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా అభ్యర్థుల ఎంపిక గురించి మరో రహస్య సర్వే నిర్వహించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలలో దాదాపు 40 శాతం మందికి టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా బయటికొచ్చిన వార్త దీనికి బలం చేకూర్చుతోంది. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. మొత్తం 15 సీట్లకు గానూ ఆ పార్టీ 14 స్థానాలను సాధించగా, మిగిలిన స్థానాన్ని మిత్రపక్షం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు చంద్రబాబు నిర్వహించిన రహస్య సర్వేలో ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేనట్టు తేలింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి శాతం అత్యధికంగా కనిపించినా సీఎం చంద్రబాబుపై సానుకూలత చెక్కు చెదరకపోవడాన్ని గుర్తించారు. సమయం దగ్గర పడుతున్నా ఇంకా పట్టనట్టుగా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎందుకనంటే జిల్లాలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న 14 మందిలో ఏడుగురికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధిష్ఠానం వారికి పరోక్షంగా తెలియజేసినా వాళ్లు మాత్రం తమ సీటు పదిలమే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారట. మొత్తానికి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీకి ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.