ఒంటరి పోరును రూఢీ చేసిన అవిశ్వాసం

ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు మీద  పవన్, జగన్, బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా, పురంధేశ్వరీ… ఇలా అంద‌రూ ముప్పేట దాడి చేస్తున్న విష‌యం విదిత‌మే! ఇదంతా చంద్ర‌బాబును ఒంట‌రిని చేసేందుకే అనే వ్యాఖ్యానాలు వినిపించాయి. దీనికి తోడు తాజాగా వీగిపోయిన అవిశ్వాసం కూడా రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఒంట‌రి పోరును మరింత స్పష్టం చేసిన‌ట్లుయ్యింది..  పైకి పవన్, జగన్ లు బీజేపిని అప్పుడ‌ప్పుడు విమ‌ర్శిస్తున్నా , చంద్ర‌బాబునే ప్ర‌ధానంగా టార్గెట్ చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. దీంతో వీరు బీజేపీ బ‌డా  నేతల క‌నుస‌న్న‌న‌లోనే ఇందంతా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. తాజాగా  జ‌రిగిన అవిశ్వాస తీర్మానంలోనూ వారు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం శోచనీయ‌మనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. జగన్ తన ఎంపీల్ని ఉప సంహరించుకోగా, ప‌వ‌న్ గతంలో అవిశ్వాసానికి మద్దతు కూడగడ‌తాన‌ని చెప్పి, ఇప్పుడు విస్మ‌రించార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 
మ‌రోవైపు టీఆర్ఎస్ ని, కేసీఆర్ ని మెచ్చుకున్న మోదీ గులాబీ ద‌ళాన్ని టీడీపీకి దూరంగా నెట్టేశారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో  బీజేపీ… తెలంగాణ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ను, ఏపీ టీడీపీకి వ్యతిరేకంగా పవన్, జగన్ లను వాడుకోబోతోందన్నద‌నే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఫ‌లితంగా  చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పక పోవచ్చువ‌చ్చ‌ని తెలుస్తోంది.  రాహుల్ టీడీపీకి, ఏపీకి కాస్త మద్దతుగా మాట్లాడారు. దీనికి మురిసిపోయి హస్తం పార్టీతో టీడీపీ జ‌త‌క‌డితే ఘోర త‌ప్పిద‌మ‌వుతుంద‌ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో 2019లో చంద్ర‌బాబుకు పెద్ద సవాలు ఎదురుకానుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ అవిశ్వాసం ద్వారా చంద్ర‌బాబు.. జనానికి ప్రత్యేక హోదా ఎవరి వల్ల రావటం లేదో అర్థంమయ్యేలా వివ‌రించ‌గ‌లిగారనేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.  హోదా, పోలవరం లాంటివి కేంద్రం ఉదాసీనత వల్లే ఆగిపోతున్నాయ‌ని ప్ర‌జ‌లు గ్ర‌హంచ‌గ‌లిగేలా  చేశారు. మ‌రి దీని ఫ‌లితం ఎలా ఉంటుంటో వేచిచూడాల్సిందే!

1 Comment

  1. Modi jimakalu elections lo Pani cheyava. Prajala voting meeda adharapadadam vundi. Mari NA ki modi ni vontariga avisvasam kanapada Leda. Siva Sena hand echinaduku, admk 35 seets epudu Laga vastayi. Bjp tho anta kagite. Five seets vastayi . DMK ki 37 vastayi . Bjp ki madagu evadu. Trs, Pavan , Jagan kumakayi a NDA ki 120belo vastayi

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.