ఏపీ పొత్తు: బాబు – రాహుల్ కొత్త ఐడియా

2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏపీలో చితికిపోయింది. ఆ మాట‌కు వ‌స్తే త‌న ఉనికే కోల్పోయింది. అపుడు గానీ కాంగ్రెస్‌కు తాను ఎంత పెద్ద త‌ప్పు చేసిందో అర్థం కాలేదు. ఏపీ విష‌యంలో తీవ్ర‌మైన ప‌శ్చాత్తాపానికి గుర‌యిన కాంగ్రెస్ పెద్ద‌లు. ఎలాగైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ప్రేమ‌ను తిరిగి పొందాల‌ని నిర్ణ‌యించార‌ట‌. ఈ విష‌యంలో రాహుల్ తీవ్రంగా ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే చంద్ర‌బాబుతో క‌లిశారు. ఇదిలా ఉంటే… అయితే, ఏపీ ప్ర‌జ‌ల‌ను గెల‌వడానికి ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ చేసిన అన్యాయానికి రెండింత‌లు మేలు చేయాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించేసుకుంది. అందుకే జాతీయ స్థాయిలో సీడ‌బ్ల్యూసీ మీటింగులో కాంగ్రెస్ ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాం. ఇంక ఎవ‌రూ అడ‌గ‌కండి అని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికీ ఆ పార్టీ ఆ మాట‌పైనే ఉంది. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్ర‌త్యేక హోదా కాంగ్రెస్ క‌చ్చితంగా ఇస్తుంద‌ని, అలా జ‌ర‌గని ప‌క్షంలో రాష్ట్రంలో అస్స‌లు ఉండ‌ను అని ఆయ‌న స‌వాల్ విసిరారు.
ఇదిలా ఉండ‌గా… తెలంగాణ ఎన్నిక‌ల త‌ర్వాత తీవ్ర డైల‌మాలో ఉన్న కాంగ్రెస్ – టీడీపీల పొత్తు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. దేశ స్థాయిలో మోడీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూనే రాష్ట్ర స్థాయిలో త‌న మార్గంలో తాను న‌డ‌వాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు – రాహుల్ కూడా చ‌ర్చించుకున్న‌ట్లు తెలిసింది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డానికి కృషి చేయండి. రాష్ట్రంలో మాకు కొంత న‌ష్టం జ‌రిగినా ప‌ర్లేదు గాని మీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాం అని రాహుల్ చంద్ర‌బాబు తో అన్నార‌ట‌. పైగా ఇది ఉభ‌య‌తార‌కం కూడా అని ఇద్ద‌రూ చ‌ర్చించుకున్నార‌ట‌.
కాంగ్రెస్ టీడీపీతో క‌లిసి పోటీ చేయ‌డం వ‌ల్ల ఇరు పార్టీల‌కు ఉప‌యోగం లేదు. అదే వేరుగా పోటీ చేస్తే క‌నీసం ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌డానికి ఒక అవ‌కాశం ఉంటుంది. దీనివ‌ల్ల వైసీపీ ఓట్లు కొన్ని చీలే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. ఇప్ప‌టికీ కాంగ్రెస్‌కు ఏపీలో క్యాడ‌ర్ ఉంది. కాక‌పోతే గ‌తంలో విభ‌జ‌న వ‌ల్ల వారుదూర‌మ‌య్యారు. అయ‌తే, కాంగ్రెస్ ర‌క్తం అంత త్వ‌ర‌గా పోదు. పైగా ఈసారి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కాంగ్రెస్ ఇస్తున్న క్లారిటీ వ‌ల్ల కాంగ్రెస్ క్యాడ‌ర్ మ‌ళ్లీ బ‌ల‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో విడివిడ‌గా పోటీ చేయ‌డం ఇరు పార్టీల‌కు లాభ‌మే అని బాబు-రాహుల్ చ‌ర్చించుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే… రాష్ట్రంలో వేర్వేరుగా పోటీ చేసినా ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు క‌చ్చితంగా ఉంటుంద‌ని చంద్రబాబు హామీ ఇచ్చారట. అయితే, ఈ నిర్ణ‌యం జ‌గ‌న్‌కు ఒక బ్యాడ్ న్యూస్‌.

1 Comment

  1. TDP coming to power is vital for Andhra Pradesh to carry forward the progress and development. Transfer of votes will decide the success or failure of alliance. In 2o14 transfer of votes took place between TDP and BJP with ease and it was fruitful.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.